కొత్త రూల్స్: విమానసిబ్బందిపై దాడిచేస్తే 2 ఏళ్ళ నిషేధం
విమానాల్లో ప్రయాణించే సమయంలో విమాన సిబ్బందితో దురుసుగా లేదా అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ విషయంలో ఇక కఠినంగా వ్యవహరంచనుంది ఎయిరిండియా.
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణించే సమయంలో విమాన సిబ్బందితో దురుసుగా లేదా అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ విషయంలో ఇక కఠినంగా వ్యవహరంచనుంది ఎయిరిండియా. కొత్త నిబంధనలను శుక్రవారం నాడు కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఈ నిబంధనలను జూన్ నుండి అమల్లోకి తీసుకురానున్నారు. ఈ నిబంధనలపై ప్రజల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
మూడు రకాల కొత్త నిబంధనలకు అమల్లోకి తెచ్చింది ఇందులో వేర్వేరు నేరాలకుగాను మూడు నెలల నుండి రెండేళ్ళవరకు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించనుంది.ఈ మేరకు కేంద్ర విమానాయానమంత్రి ఆశోక్ గజపతి రాజు శుక్రవారం నాడు వెల్లడించారు.
ఈ నిబంధనలపై ప్రజల నుండి సలహాలను స్వీకరించనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఈ నిబంధనలను జూన్ నుండి అమలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

విమానాల్లో గానీ, లేదా విమానాశ్రయాల్లో గానీ ఏవైనా సమస్యలు సృష్టిస్తే అప్పుడు నో -ఫ్లై లిస్టులోకి చేరుతారు.అయితే ప్రయాణీకులు చేసే నేరాలను మూడు లెవెల్స్ గా విభజించారు. లెవెల్ 1 లో శారీర చేష్టల ద్వారా అంతరాయం కలిగించడం, లెవెల్ 2 లో బౌతికదాడులు లేదా లైంగిక వేధింపులు, లెవెల్ 3 లో ప్రాణాలకు ముప్పు తెచ్చేరీతో బెదిరింపులు లేదా ప్రవర్తిస్తే విమాన ఆపరేటింంగ్ సిస్టమ్ ను నష్టపరచడం లాంటివి ఉన్నాయి.
లెవల్ 1 కు మూడు నెలు, లెవెల్ 2 కు ఆరుమాసాలు, లెవెల్ 3 తరహా నేరాలకు రెండేళ్ళపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించే అవకాశం ఉంటుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా విమానంలో ఒక మేనేజర్ ను 25 సార్లు చెప్పుతో కొట్టడంతో ఆయనను ఏ విమానంలో ఎక్కకుండా చాలారోజులపాటు టిక్కెట్లు కూడ రద్దు చేశారు.ఈ విషయమై పార్లమెంట్ ఉభయసభల్లో కూడ గందరగోళం జరిగింది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications