భర్తను కట్టేసి, కొట్టి ఇంటిని దోచిన కొత్త పెళ్లి కూతురు

లక్నో: కొత్త పెళ్లి కూతురు తన భర్తను కట్టిపడేసి, తన పుట్టింటి కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటిని దోచిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సమాచారం మేరకు.. ఈ సంఘటన యూపీలోని ఫరూకాబాద్ జిల్లాలో జరిగింది.

ఉమాశంకర్ అనే వ్యక్తి ఇటీవలే నేహ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం నాడు నేహ తల్లి, సోదరులు ఆమెను చూసేందుకు ఉమాశంకర్ ఇంటికి వచ్చారు. వీరంతా కలిసి శుక్రవారం నాడు రాత్రి ఉమాశంకర్ ఇంట్లో తిన్నారు.

ఆ తర్వాత రాత్రిపూట, నేహ, ఆమె తల్లి, సోదరులు ఉమాశంకర్‌ను మంచానికి కట్టిపడేశారు. అయితే, అతను నిద్రలో నుంచి లేచి వారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. కానీ, కొత్త వధువు, కుటుంబ సభ్యులు అతనిని చితకబాదారు.

 Newly wed husband robbed by bride and her family in Uttar Pradesh

నేహ, ఆమె తల్లి, సోదరులు ఇంట్లో ఉన్న డబ్బును, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకు పోయారు. అక్కడే ఉన్న జీపులో వాటిని తరలించుకుపోయారు. ఈ విషయం శనివారం వెలుగు చూసింది.

ఉమాశంకర్ సోదరుడు శివశంకర్ ఇంటికి వచ్చాడు. తన సోదరుడు కట్టి పడేసి ఉండటాన్ని గమనించాడు. వెళ్లి కట్లు విప్పి, విషయం కనుక్కున్నాడు. అనంతరం వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

గాయపడిన ఉమాశంకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు సదరు కొత్త పెళ్లి కూతురు ఇంటికి వెళ్లింది. అయితే, అక్కడ వారు కనిపించలేదు.

రైల్లో నుంచి టీసీ తోసేయడంతో మహిళ మృతి

మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ఓ మహిళను టికెట్‌ పరిశీలకుడు (టీసీ) నెట్టివేయడంతో ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లోని బెర్చా స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓం కుమారి తెమ్రే(55) తన కుమారుడు, కుమార్తెతో కలిసి జనరల్‌ బోగీలో స్థలం లేకపోవడంతో రిజర్వేషన్‌ బోగీలో ఎక్కారు.

టీసీ తోసివేయంతో పట్టుతప్పి తన తల్లి రైలు చక్రాల కింద పడిపోయిందని కుమారుడు ఆరోపించాడు. టీసీ తోసివేశాడో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+