News Bride: పెళ్లైన రెండు వారాలకే కొత్త పెళ్లి కూతురు జంప్ జిలాని, నగలు ముఖం మీద విసిరి కొట్టింది !

తిరువనంతపురం/చెన్నై: యువతి, యువకుడు ప్రేమించుకుని మూడు సంవత్సరాల పాటు సంతోషంగా తిరిగారు. పెళ్లికి ప్రియురాలి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతికి ఇష్టం లేకపోయినా ప్రియురాలికి వేరే యువకుడితో ఆమెకు పెళ్లి సెట్ చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నా ఆమె కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. బందువులను పిలిపించి రెండు వారాల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిపించేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు హమ్మయ్యా అనుకున్నారు. పెళ్లైన రెండు వారాలుకు భర్త ఇంటిలో అతనితో కాపురం చేసిన భార్య తరువాత పెళ్లికి కుటుంబ సభ్యులు ఇచ్చిన బంగారు నగలు మొత్తం వేసుకుంది. ఇంటి బయటకు వచ్చిన కొత్త పెళ్లి కూతురు కారు నడుపుకుంటూ వెళ్లి మాయం అయిపోయింది. కొత్త పెళ్లి కూతురి కోసం ఎక్కడెక్కడో వెతికిన పోలీసులు చివరికి ఆమెను పట్టుకున్నారు. తనకు భర్త వద్దేవద్దని, తనకు తన ప్రియుడే కావాలని కొత్త పెళ్లి కూతురు రివర్స్ అయ్యింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలతో రగిలిపోయిన కొత్త పెళ్లి కూతురు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు తీసి వారి ముఖం మీద కొట్టింది. కొత్త పెళ్లి కూతురు ప్రముఖ జాతీయ బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తోంది.

 బ్యాంకులో ఉద్యోగం

బ్యాంకులో ఉద్యోగం

కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్న సంగీత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ప్రముఖ జాతీయ బ్యాంకులో సంగీత క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న సంగీత చూడటానికి అందంగా ఉంటోంది. కాలేజ్ లో చదవే సమయంలోనే సంగీత చాలా చురుకుగా ఉండేదని తెలిసింది.

 హ్యాపీగా తిరిగిన ప్రేమికులు

హ్యాపీగా తిరిగిన ప్రేమికులు

బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సంగీతకు కొన్ని సంవత్సరాల క్రితం కార్తీక్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను కార్తీక్, సంగీతల పరిచయం ప్రేమగా మారింది. ప్రేమికులు కార్తీక్, సంగీత గత మూడు సంవత్సరాల పాటు సంతోషంగా తిరిగారు. ఎలాగైనా పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని కార్తీక్, సంగీత ఆలోచించారు.

 వేరే అబ్బాయితో పెళ్లిచేసేశారు

వేరే అబ్బాయితో పెళ్లిచేసేశారు

కార్తీక్, సంగీతల పెళ్లికి ప్రియురాలి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సంగీతకు ఇష్టం లేకపోయినా వేరే యువకుడితో ఆమెకు పెళ్లి సెట్ చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని సంగీత చెబుతున్నా ఆమె కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. బందువులను పిలిపించి రెండు వారాల క్రితం సంగీతను వేరే అబ్బాయికి ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి జరిపించేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు హమ్మయ్యా అనుకున్నారు.

 రెండు వారాలకే కొత్త పెళ్లి కూతురు ప్రియుడితో జంప్

రెండు వారాలకే కొత్త పెళ్లి కూతురు ప్రియుడితో జంప్

వివాహం జరిగిన మూడు రోజుల తరువాత సంగీతను ఆమె భర్త ఇంటికి పంపించేశారు. అప్పటి నుంచి సంగీత ఆమె భర్త ఇంటిలో ఉంటున్నది. వివాహం జరిగిన తరువాత రెండు వారాలు భర్త ఇంటిలో అతనితో కాపురం చేసిన సంగీత తరువాత పెళ్లికి కుటుంబ సభ్యులు ఇచ్చిన 50 సవర్ల బంగారు నగలు మొత్తం వేసుకుంది. భర్త ఇంటి బయటకు వచ్చిన కొత్త పెళ్లి కూతురు సంగీత కారు నడుపుకుంటూ వెళ్లి మాయం అయిపోయింది.

 ప్రియుడి మీద కేసు పెట్టిన అమ్మాయి తండ్రి

ప్రియుడి మీద కేసు పెట్టిన అమ్మాయి తండ్రి

రాత్రి అయినా సంగీత ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఆందోళనకు గురై ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో సంగీత కోసం వెతికారు. సంగీత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. హడలిపోయిన సంగీత తండ్రి తన కుమార్తె కనపడంలేదని, మా అమ్మాయిని కార్తీక్ లేపుకుని వెళ్లాడని అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 నాకు మొగుడు వద్దు.... ప్రియుడు కావాలి

నాకు మొగుడు వద్దు.... ప్రియుడు కావాలి

కొత్త పెళ్లి కూతురు సంగీత కోసం ఎక్కడెక్కడో వెతికిన పోలీసులు చివరికి ఆమెను, ఆమె వెంట ఉన్న కార్తీక్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. తనకు భర్త వద్దేవద్దని, తనకు తన ప్రియుడు కార్తీక్ కావాలని కొత్త పెళ్లి కూతురు సంగీత రివర్స్ అయ్యింది. ఇదే సమయంలో సంగీత కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు.

 నగలు విసిరి కొట్టిన కొత్త పెళ్లి కూతురు

నగలు విసిరి కొట్టిన కొత్త పెళ్లి కూతురు

మా అమ్మాయి దగ్గర ఉన్న బంగారు నగలు, ఆస్తి, డబ్బు, ఉద్యోగం కోసమే కార్తీక్ ఆమెను వలలో వేసుకున్నాడని ఆరోపించారు. కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలతో రగిలిపోయిన కొత్త పెళ్లి కూతురు సంగీత ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు తీసి వారి ముఖం మీద కొట్టింది. తాను మేజర్ అని, నేనే నా ప్రియుడితోనే ఉంటానని సంగీత తేల్చి చెప్పింది. పోలీసులు కూడా ఇక చేసేది ఏమీలేక సైలెంట్ అయిపోవడంతో కొత్త పెళ్లి కూతురు సంగీత ఆమె ప్రియుడు కార్తీక్ వెంట వెళ్లిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+