దీపావళి 'గిఫ్ట్' గా ఫాస్టాగ్ వార్షిక పాస్ - ఇలా చేస్తే, వెంటనే..!!
ఫాస్టాగ్ పాస్ వినియోగంలో కీలక మార్పులు జరిగాయి. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రవాణా శాఖ 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్‌లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంచింది. రూ 3 వేలకే వార్షిక పాస్ ప్రవేశ పెట్టింది. కాగా.. తాజాగా మరో కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పండగ సీజన్‌లో ప్రయాణికులకు సరికొత్త కానుక పైన ప్రకటన చేసింది. దీంతో, ఇప్పుడు ఈ నిర్ణయం ప్రయాణీకులకు ఆసక్తిగా మారింది.
దీపావళి.. పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. జాతీయ రహదారుల పైన తరచూ ప్రయాణించే వారి కోసం కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తమ 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పండగ రోజుల్లో ప్రయాణించే వారికి ఇది సరైన బహుమతి గా పేర్కొంది. ఎవరైతే ఫాస్టాగ్ ను గిఫ్టుగా పంపాలనుకుంటారో.. వారు తమ 'రాజ్‌మార్గ్ యాత్ర' యాప్‌లో 'యాడ్ పాస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత, ఎవరికైతే పాస్ ఇవ్వాలని అనుకుంటున్నారో వారి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాలి.

యాప్ లో కావాల్సిన సమాచారం ఇచ్చిన తరువాత ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి కాగానే, ఆ వాహనానికి లింక్ అయిన ఫాస్టాగ్‌పై యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన రెండు గంటల్లో పాస్ పనిచేయడం ప్రారంభమవుతుంది. గిఫ్ట్ గా ఇచ్చే ఈ యాన్యువల్ పాస్ ధర రూ.3,000గా కొనసాగనుంది. దీని వ్యాలిడిటీ ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల వరకు ఉంటుంది.
ఈ పరిమితి ముగిసిన తర్వాత ఫాస్టాగ్ ఆటోమేటిక్‌గా సాధారణ పే-పర్-ట్రిప్ విధానంలోకి మారిపోతుంది. దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఇది కేవలం వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఈ పాస్ యాక్టివేట్ కావాలంటే వాహనం ఫాస్టాగ్‌కు పూర్తి రిజిస్ట్రేషన్ నంబర్ అనుసంధానమై ఉండాలని అధికారులు వెల్లడించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications