Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్ జిందాబాద్, రెండు దేశాల కోసం గూడాచారి, క్లైమాక్స్ లో ఎక్కడ చిక్కాడంటే?

శ్రీలంక, పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టు అయిన నిందితుడు జైలుకు వెళ్లాడు. జైలు శిక్ష అనుభవించిన తరువాత బెయిల్‌పై విడుదలై పరారీలో ఉన్న నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. పాకిస్థాన్ కోసం పని చేస్తున్న నిందితుడు జైలు నుంచి విడుదలై తప్నించుకోవడంతో అతన్ని పట్టించిన వారికి లక్షలాది రూపాయలు బహుమానం ఇస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు.

నిందితుడిని పట్టించిన వారికి, అతని ఆచూకి గురించి తెలిపిన వారికి రూ. 5 లక్షల నగదు రివార్డు ఉంది. నిందితుడు నూరుద్దీన్ అలియాస్ రఫీని కర్ణాటకలోని మైసూర్‌లోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఎన్ఐఏ బృందం అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. నిందితుడు నూరుద్దీన్‌ను అరెస్టు చేసిన అనంతరం అతను నివాసం ఉంటున్న ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి అతని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లు, డ్రోన్ సహా పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

NIA arrested the accused who was working for Pakistan and was released on bail in Mysuru

బెయిల్‌పై విడుదల అయిన నిందితుడు తరువాత తప్పించుకున్నాడు. షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన తర్వాత చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు హాజరుకాకుండా నిందితుడు నూరుద్దీన్‌ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి నూరుద్దిన్ కోసం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు వెతుకుతూనే ఉన్నారు. నూరుద్దిన్ పై గతంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కోర్టు నూరుద్దిన్ ను మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ప్రకటించింది.

ఈ కేసు శ్రీలంకలోని కొలంబోలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక జాతీయుడు ముహమ్మద్ సకీర్ హుస్సేన్, పాకిస్తాన్ జాతీయుడు అమీర్ జుబైర్ సిద్ధిక్ యొక్క ఉగ్రవాద కుట్రలకు నిందితుడు నూరుద్దిన్ సహకిరించాడని అధికారులు తెలిపారు.

2014లో చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌, బెంగళూరులోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ పేర్కొంది. నిందితుడు నూరుద్దీన్‌ పాకిస్థానీ పౌరుడి ఆదేశానుసారం హైక్వాలిటీ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ల ద్వారా దేశ వ్యతిరేక గూఢచర్య కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో నిమగ్నమైనట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+