డిస్కో శాంతి మేనకోడలు అదృశ్యం: 5రోజులైనా కానరాని ఆచూకీ

Subscribe to Oneindia Telugu

చెన్నై: దివంగత ప్రముఖ తెలుగు నటుడు శ్రీహరి సతీమణి శాంతి మేనకోడలు అబ్రిన్‌ అదృశ్యమైంది. ఆమె సోదరుడు, సహాయ దర్శకుడు అరుణ్‌ మొళి వర్మన్‌ కుమార్తె అబ్రిన్‌ (17) గత ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి మీడియాను ఆశ్రయించారు.

సెప్టెంబరు 6న పాఠశాలకు వెళ్లిన అబ్రిన్‌ తిరిగి ఇంటికి రాలేదని అన్నారు. గత ఐదు రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నా ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీ నగర్‌లోని పాండిబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు.

Niece of actors ‘Disco’ Shanti and Lalithakumari,goes missing from school

పాఠశాల చుట్టూ 56 సీసీటీవీలు ఉన్నాయని, కానీ అందులో కొన్ని పనిచేయడం లేదని పాఠశాల యాజమాన్యం చెప్పినట్లు తెలిపారు. దీంతో అబ్రిన్‌ కేసు విచారణ పోలీసులకు కష్టతరమౌతోందని తెలిపారు.

శాంతి, లలిత కుమారి విజ్ఞప్తి మేరకు దక్షిణ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘం (నడిగార్‌ సంఘం) సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు అబ్రిన్‌ అదృశ్యమైందని సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అబ్రిన్ గురించిన సమాచారం ఏమైనా తెలిస్తే.. ఏసీపీ వీ జయకుమార్ ఫోన్ నెం. 9952035456 లేదా 9962566556, అరున్-9884441104 లను సంప్రదించవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 17-year-old niece of actors ‘Disco’ Shanti and Lalithakumari, has gone missing and a police complaint has been filed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి