Cyber Crime: వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..
ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.13 లక్షలు పోగొట్టుకుంది. ఢిల్లీలో ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఓ నైజీరియన్ ఆమెకు వాట్సప్ పెళ్లి ప్రపోజల్ చేశాడు. తాను కూడా డాక్టర్ అని చెప్పుకున్నాడు. ఇలా వైద్యురాలి వద్ద విడతల వారీగా రూ.13 లక్షలు కాజేశాడు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన మహిళా వైద్యురాలు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో నమోదు చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వివరాలు నమోదు చేసింది. అయితే ఇదే మ్యాట్రిమోనియల్ సైట్ లో కొంత మంది నైజిరియన్లు నకిలీ ఫొటో, వివరాలతో నమోదు చేసుకున్నారు. సదరు వైద్యురాలని గుర్తించిన నైజిరియన్ మ్యాట్రిమోనియల్ సైట్ ఉన్న నంబర్ కు వికాస్ కుమార్ అనే పేరుతో వాట్సప్ చేశాడు. తన కూడా డాక్టర్ అని విదేశాల్లో పని చేస్తున్నానని.. త్వరలో ఇండియాకు వచ్చి ఆస్పత్రి పెట్టనున్నట్లు చెప్పాడు.

"వికాస్ కుమార్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయడం అయ్యాడు. తర్వాత ఫోన్ చేశాడు. వాట్సప్ సందేశాలు పంపాడు. తాను స్కాట్లాండ్‌లో ఉంటున్నానని వికాస్ చెప్పాడు. మీమిద్దరం చాలా కంలో ఫోన్లలో, వాట్సప్ లో చాటింగ్ చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వికాసమ తనకు పెళ్లి ప్రపొజల్ చేశాడు. పెళ్లి నేను అంగీకరించాను. తన పుట్టిన రోజు సందర్భంగా వికాస్ బహుమతి కూడా పంపాడు" అని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పింది.
ఫోన్లో ఓ వ్యక్తి తాను కస్టమ్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నాననని చెప్పాడని తెలిపింది. మీకు స్కాట్లాండు నుంచి బహుమతి వచ్చిందని.. అది మీకు చేరాలంటే రూ.35 వేలు చెల్లించాలని చెప్పాడని వివరించింది. దీంతో తాను అతని ఖాతాలో రూ.35 వేలు జమ చేసినట్లు పేర్కొంది. వైద్యురాలికి మరుసటి రోజు మరో ఫోన్ వచ్చింది. మీ స్కాట్లాండ్ నుంచి మీ పార్శిల్‌లో విదేశీ కరెన్సీ ఉందని, దాని కోసం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆమె మరో రూ.50 వేలు పంపింది.
ఇలా మహిళా వైద్యురాలి వద్ద దాదాపు రూ.13 లక్షలు కాజేశారు. ఈ క్రమంలోనే వికాస్ కుమార్ వైద్యురాలితో మాట్లాడడం తగ్గించాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ స్వీచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు తెలుసున్న వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంకేతిక ఆధారాలతో ఢిల్లీలో ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 మోసాలకు పాల్పడ్డట్లు చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications