IT Hub: అద్దె డబ్బులు అడిగిన మేనేజర్ ను కొట్టి చంపేసిన విదేశీయుడు, టూరిస్టు వీసాతో వచ్చి !

బెంగళూరు: విదేశాల నుంచి టూరిస్టు వీజాతో భారత్ చేరుకున్న యువకుడు ఇక్కడ పలు సిటీల్లో సంచరించాడు. టూరిస్టు వీసా గడుపు పూర్తి అయిన తరువాత అతను అతని దేశానికి వెళ్లకుండా ఇక్కడే మకాం వేశాడు. వ్యాపారం చేస్తున్నానని, ఉద్యోగం చేస్తున్నానని అందరిని నమ్మించి ఐటీ హబ్ లో కాలం గడిపేశాడు. ఆరు నెలలకు ఒకసారి ఇళ్లు మారుస్తూ అతని ఇంతకాలం కాలం వెళ్లదీస్తున్నాడు. కొన్ని నెలల క్రితం బెంగళూరు సిటీ శివార్లలోకి వెళ్లిన విదేశీయుడు అక్కడ అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ప్రతినెల అద్దె డబ్బులు, నీటి బిల్లు, కరెంట్ బిల్లు చెల్లించే విషయంలో భవనం యజమానితో పాటు ఆ బిల్డర్ దగ్గర మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తికి సినిమా చూపిస్తున్నాడు. అద్దె డబ్బులు మర్యాదగా ఇస్తే ఇవ్వు, లేదంటే బయటకు వెళ్లిపో అని చెప్పిన ఆ భవనం మేనేజర్ ను విదేశీయుడు దారుణంగా కొట్టి చంపేయడం కలకలం రేపింది.

నైజీరియా నుంచి ఎందుకు వచ్చాడంటే ?

నైజీరియా నుంచి ఎందుకు వచ్చాడంటే ?


నైజీరియాకు చెందిన డేనియల్ చినజోర్ అలసో అలియాస్ బాబీ (36) అనే యువకుడు 10 సంవత్సరాల క్రితం భారత్ రావడానికి ప్రయత్నించాడు. అప్పట్లో డేనియల్ టూరిస్టు వీజాతో భారత్ చేరుకున్నాడు. తరువాత భారత్ లోని పలు సిటీల్లో డేనియల్ సంచరించాడు. టూరిస్టు వీసా గడుపు పూర్తి అయిన తరువాత కూడా డేనియల్ అతని దేశానికి వెళ్లకుండా భారత్ లోనే మకాం వేశాడు.

ఐటీ హబ్ లో సేఫ్ అని సెటిల్ అయిపోయాడు

ఐటీ హబ్ లో సేఫ్ అని సెటిల్ అయిపోయాడు


వ్యాపారం చేస్తున్నానని కొందరికి చెప్పి, ఉద్యోగం చేస్తున్నానని అందరినీ నమ్మించిన డేనియల్ ఐటీ హబ్ బెంగళూరులోనే కాలం గడిపేశాడు. ఆరు నెలలకు ఒకసారి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఇళ్లు మారుస్తున్న డేనియల్ ఇంతకాలం కాలం ఏదోఒకటి చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.

బెంగళూరు సిటీ శివార్లకు వెళ్లిపోయాడు

బెంగళూరు సిటీ శివార్లకు వెళ్లిపోయాడు

బెంగళూరులోని కేఆర్ పురం పరిసర ప్రాంతాల్లోనే డేనియల్ ఎక్కువగా నివాసం ఉన్నాడని వెలుగు చూసింది. కొన్ని నెలల క్రితం బెంగళూరు సిటీ శివార్లలోని హోస్ కోటే సమీపంలోని మల్లిమాకనపుర ప్రాంతానికి వెళ్లిన డేనియల్ అక్కడ భరత్ అనే బిల్డర్ కు చెందిన భవనంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.

విదేశీయుడిని బయటకు తోసేసిన మేనేజర్

విదేశీయుడిని బయటకు తోసేసిన మేనేజర్


ప్రతినెల అద్దె డబ్బులు, నీటి బిల్లు, కరెంట్ బిల్లు చెల్లించే విషయంలో భవనం యజమాని భరత్ తో పాటు అతని బిల్డింగ్ చూసుకుంటున్న మేనేజర్ శివకుమార్ కు డేనియల్ సినిమా చూపిస్తున్నాడు. ఇంటి అద్దె డబ్బులు అడిగితే రేపు ఇస్తాను, వచ్చే వారం ఇస్తాను అంటూ డేనియల్ కాలం గడపం మొదలు పెట్టాడు. అద్దె డబ్బులు మర్యాదగా ఇస్తే ఇవ్వు, లేదంటే బయటకు వెళ్లిపో అని చెప్పిన ఆ భవనం మేనేజర్ శివకుమార్ డేనియల్ ఇంట్లోని వస్తులు బయట విసిరేశాడు.

 అద్దె డబ్బులు ఇవ్వమని అడిగితే చంపేశాడు

అద్దె డబ్బులు ఇవ్వమని అడిగితే చంపేశాడు

ఆ సమయంలో సహనం కోల్పోయిన డేనియల్ బిల్డింగ్ మేనేజర్ శివకుమార్ తలను గోడకు వేసి కొట్టడంతో అతని తల పగిలిపోయి అతని ప్రాణం పోయింది. డేనియల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అద్దె డబ్బులు అడిగినందుకు విదేశీయుడు మేనేజర్ శివకుమార్ ను దారుణంగా కొట్టి చంపేయడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+