దారుణం : బాలికపై 9 మంది గ్యాంగ్ రేప్.. రెండు రోజులపాటు నరకం చూపిన దుర్మార్గులు
పొల్లాచ్చి : చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా యువతలు, మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకోపోయిన దుర్మార్గులు ఆడపిల్లల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరులోని పొల్లాచిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన పది మంది కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. రెండు రోజుల పాటు అమ్మాయికి నరకం చూపించిన వారిని పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

బండిపై వచ్చి బాలికను కిడ్నాప్ చేసి
పొల్లాచ్చికి చెందిన 16ఏళ్ల బాలిక గురువారం సాయంత్రం తన చెల్లెలితో కలిసి దుకాణానికి వెళ్లి తిరిగి వస్తోంది. ఇంతలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వారిని అడ్డగించాడు. బాలికను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఊహించని సంఘటనతో షాక్‌కు గురైన బాలిక చెల్లెలు కాసేపటికి తేరుకుని ఇంటికెళ్లి అక్క కిడ్నాప్ విషయం చెప్పింది. వారు వెంటనే పొల్లాచ్చి వెస్ట్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులకు చిక్కిన నిందితుడు
శుక్రవారం రాత్రి పొల్లాచ్చి వాల్పారై రోడ్డుపై పెట్రోలింగ్ టీం తనిఖీలు చేస్తుండగా.. కిడ్నాప్‌కు గురైన బాలికను ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ కనిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అమానుల్లా అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

పరారీలో నిందితుడు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన దిండుగల్‌కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన తొమ్మిది మందిపై పోక్సోతో పాటు ఐపీసీ సెక్షన్ 366(ఏ) కింద కేసు నమోదుచేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారిని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications