నీరవ్ మోడీకి షాక్: బీచ్‌కు ఎదురుగాఉన్న ఖరీదైన బంగ్లాను కూల్చివేయనున్న అధికారులు
బ్యాంకులకు కుచ్చుటోపీ వేసి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన ఆస్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న బీచ్ ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన భవనంను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇప్పటికే ఆ భవంతిని కూల్చేందుకు కావాల్సిన మెషినరీని అక్కడకు చేర్చారు రాయిగడ్ సబ్ డివిజినల్ అధికారులు.
ఇక ఈ భవంతిని కూల్చేందుకు మొత్తంగా నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈడీ ఆస్తుల స్వాధీనంలో భాగంగా కూల్చివేతకు కావాల్సిన అన్ని అనుమతి పత్రాలను రాయిగడ్ కలెక్టొరేట్‌లో సమర్పించింది. అంతకుముందు నీరవ్ మోడీకి చెందిన ఈ బంగ్లాను ఈడీ అటాచ్ చేసింది. బంగ్లాకు సంబంధించి అక్రమాలు కలెక్టర్ విచారణలో బయటపడటంతో ఈడీ దీన్ని అటాచ్ చేసింది.

అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో 1.5 ఎకరాల్లో ఈ బంగ్లా ఉంది. 2004లో నీరవ్ మోడీ రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక్కడే తన ఖరీదైన వజ్రాలను తన క్లైంట్లకు ప్రదర్శనకు ఉంచుతాడు. అంతేకాదు కొన్ని పార్టీల కోసం కూడా ఈ ఫాంహౌజ్‌ను నీరవ్ మోడీ వినియోగిస్తారని తెలుస్తోంది. ముంబై నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయగడ్ ప్రాంతంలో ఈ ఫాంహౌజ్ ఉంది. దీనిపక్కనే 12వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇందులో ఐదు బెడ్‌రూంలు, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, ఓ థియేటర్, లైబ్రరీ ఉన్నట్లు సమాచారం.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications