Saree: దేశంలో అత్యంత ఖరీదైన చీర ధరించేది ఎవరో తెలుసా..!
సాధారణంగా చీర ఎంత ఉంటుంది.. మామూలు చీర(Saree) అయితే రూ.500 ఉంటుంది. పట్టు చీర అయితే రూ.10 వేలు ఉంటుంది. మహా అయితే రూ.లక్ష ఉంటుంది. ఇంకా ఎక్కవంటే.. రూ.10 లక్షలు ఉంటుంది. కానీ రూ.40 లక్షల చీర ఉందని మీకు తెలుసా.. ఆ చీర ఎవరు ధరిస్తారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య, పారిశ్రామికవేత్త నీతా అంబానీ సుప్రసిద్ధ సాంఘికవేత్త. ఆమె ఖరీదైన, విలక్షణమైన దుస్తులు ధరిస్తారని పేరు ఉంది. నీతా అంబానీ పెళ్లికి ధరించిన చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా ప్రసిద్ధి చెందింది.
ఆ చీర ఖరీదు రూ.40 లక్షలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ చీర బంగారు జరీ వర్క్ తో ఉంది. బ్లౌజ్ పై ఖరీదైన పెయింటింగ్ డిజైన్‌ను ఉంది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. ఈ చీర ఎంబ్రాయిడరీకిప్రసిద్ధ కంచి సిల్క్, చక్కటి బంగారు లేస్‌లు వాడారు. ఈ చీర పచ్చ, కెంపు, పుష్యరాగం, ముత్యాలు పొదిగిన రాళ్లతో దృష్టిని ఆకర్షించేలా తయారు చేశారు. ఈ చీర నేయడానికి కాంచీపురానికి చెందిన 36 మంది కళాకారులు కలిసి పనిచేసినట్లు తెలిసంది.

ఈ చీర దాదాపు ఏడాది పాటు తయారు చేశారు. నీతా అంబానీ, పరిమళ్ నత్వానీ కుమారుడి వివాహానికి రూ.40 లక్షల గులాబీ రంగు చీరను ధరించారు. ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం రూపొందించారు. నీతా అంబానీ 2015లో రాజ్యసభ మాజీ సభ్యుని కుమారుడు పరిమల్ నత్వానీ వివాహ వేడుకలో 8 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ఖరీదైన చీరను ధరించారు. ఆమె చీరతో పాటు వజ్రాలతో చేసిన భారీ నెక్లెస్‌ను కూడా ధరించారు.

ఇషా అంబానీ వెడ్డింగ్ లెహెంగా రూ. 90 కోట్లు ఖర్చు చేసి, ఆమె తల్లి నీతా అంబానీ పెళ్లి దుస్తులతోతయారు చేయించారు. నీతా అంబానీ తన పెద్ద కొడుకు ఆకాష్ పెళ్లిలో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన పింక్ లెహంగా ధరించారు. అయితే నీతా అంబాని బిలియనీర్ భార్య కాబట్టి లక్షలు విలువ చేసే చీరలు వాడతారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications