Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూల్ ఈజ్ రూల్: సొంత మామ ఇంటినే కూల్చేసిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

రోడ్డు కోసం సొంత మామ ఇల్లే కూల్చేశారు!
వ్లాగ్‌లో భాగంగా ఫరా ఖాన్ వంటమనిషి దిలీప్ తన ఊరిలో రోడ్డు వేయమని గడ్కరీని కోరగా.. ఫరా తమాషాగా "దిలీప్ ఇంటి మీద నుంచే రోడ్డు వేయండి సార్" అని అంది. దీనిపై గడ్కరీ భార్య కాంచన్ స్పందిస్తూ, "అప్పుడు దిలీప్‌కు ఇల్లు ఉండదు.. మా నాన్నగారికి జరిగినట్లే జరుగుతుంది" అని గుర్తుచేశారు. రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు గడ్కరీ స్వయంగా వెల్లడించారు. మరి ఆయనకు కొత్త ఇల్లు కట్టించారా? అని ఫరా అడగగా.. "లేదు, కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రమే ఇచ్చాను" అని ఆయన నవ్వుతూ చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఈ ఘటన నిరూపిస్తోంది.

Nitin Gadkari Reveals Demolishing His Own In-Law House for Road Expansion

కోల్‌కతా రెస్టారెంట్ యజమానికి చుక్కలు!
మరో ఆసక్తికరమైన ఘటనను గడ్కరీ పంచుకున్నారు. ఇటీవల కోల్‌కతా వెళ్లినప్పుడు ఒక రెస్టారెంట్‌లో చైనీస్ ఫుడ్ ఆయనకు బాగా నచ్చింది. ఆ వంటకాన్ని తన వ్యక్తిగత చెఫ్‌కు నేర్పించమని ఆయన కోరగా.. అది తమ పాలసీకి విరుద్ధమని రెస్టారెంట్ యాజమాన్యం తిరస్కరించింది. అప్పుడు గడ్కరీ, "ఈ రెస్టారెంట్ ఎవరి భూమిలో ఉందో తెలుసా? ఇది కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ భూమి.. నేను షిప్పింగ్ మంత్రిని. మీరు నేర్పించకపోతే మీ లీజు రద్దు చేస్తాను" అని సరదాగా హెచ్చరించడంతో వారు దిగొచ్చారని చెప్పారు.

41 ఏళ్ల వైవాహిక బంధం
గడ్కరీ దంపతుల వివాహం జరిగి 41 ఏళ్లు పూర్తయింది. వ్లాగ్‌లో పెళ్లి రోజు ఎప్పుడని ఫరా అడగగా.. గడ్కరీ కాసేపు తడబడ్డారు. "మగవాళ్లందరిలాగే ఈయన కూడా మర్చిపోయారు" అని ఫరా ఆటపట్టించగా.. ఆయన భార్య కాంచన్ జోక్యం చేసుకుని తేదీని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+