Nitish 10.0: బీజేపీ ఆధిపత్యం- నితీష్ కేబినెట్ కూర్పు ఇదీ..
బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఆయన ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
ఈ ఉదయం 11: 30 గంటలకు పాట్నా గాంధీ మైదాన్ నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు కేబినెట్ సహచరులు, బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.

నితీష్ కుమార్ ప్రభుత్వంలో చేరే మంత్రుల పేర్లు ఖరారు అయ్యాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాల పేర్లు బీజేపీ కోటా నుండి వచ్చిన మంత్రుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. వీరితో పాటు బీజేపీ తరపున 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేడీయూ తరపున ఏడుమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్జేపీ- 2, హెచ్ఎఎం, ఆర్ఎంఎల్ తరపున ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేస్తారు.
బీజేపీ నుంచి..
సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంగళ్ పాండే, డాక్టర్ దిలీప్ జైస్వాల్ (ఎమ్మెల్సీ), నితిన్ నబిన్, రామ్‌కృపాల్ యాదవ్, సంజయ్ సింగ్ 'టైగర్', అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, నారాయణ్ ప్రసాద్, రామ నిషాద్, లఖేంద్ర పాశ్వాన్, శ్రేయసి సింగ్, డాక్టర్ ప్రమోద్ కుమార్ చంద్రవంశీ ఉన్నారు. స్పీకర్ పోస్ట్ కూడా బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీకి చెందిన ప్రేమ్ కుమార్.. స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
జేడీయూ నుంచి..
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు విజయ్ కుమార్ చౌదరి, శ్రావణ్ కుమార్, విజేంద్ర యాదవ్, అశోక్ చౌదరి, లేసీ సింగ్, జామా ఖాన్, మదన్ సాహ్ని ఉన్నారు. ఎల్జేపీ నుంచి సంజయ్ కుమార్, సంజయ్ సింగ్, హిందుస్తాన్ ఆవామీ మోర్చా నుంచి సంతోష్ కుమార్ సుమన్, ఆర్ఎంఎల్ నుంచి దీపక్ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications