Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నితీష్ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు!: ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

Bihar Cabinet: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి నూతన సర్కారు ఏర్పాటుపై ఉంది. ఎన్డీయే కూటమి ఏకంగా 202 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా.. మహాఘట్‌బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. ఈ అద్భుత విజయం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి నేతలు చర్యలు చేపట్టారు. అయితే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 19 లేదా 20 తేదీలలో నూతన సర్కారు కొలువుదీరే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశాలున్నాయి. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం (నవంబర్ 16, 2025) రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అధికారికంగా సమర్పించనుంది. ఎన్నికల ఫలితాలను గవర్నర్‌కు సమర్పించిన తర్వాత, కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జరగాల్సిన కొన్ని కీలక పరిణామాలు ఈ విధంగా ఉండనున్నాయి. సోమవారం (నవంబర్ 17) మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశముంది. ఈ సమావేశంలో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయడానికి ఆమోదం తెలిపే తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.ఆ తీర్మానం ఆమోదించబడిన వెంటనే, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. ఈ చర్యతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా చర్యలు ప్రారంభమవుతాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నవంబర్ 19 లేదా 20 తేదీల్లో ఉండే అవకాశం ఉంది. ఈ తుది తేదీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్‌ను బట్టి నిర్ణయించనున్నారు. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత, ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ బలాన్ని ప్రదర్శిస్తారు.

Nitish Kumar as Bihar CM Again Oath Ceremony Likely on Nov 19 or 20

ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు
ప్రస్తుతం జేడీయూకు చెందిన సీనియర్ నాయకులు లలన్ సింగ్, సంజయ్ ఝా ఢిల్లీలో మకాం వేయడంతో, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రిత్వ శాఖల పంపిణీపై ప్రాథమిక అంగీకారం కుదిరింది. తుది ప్రకటనకు ముందు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అలా చూస్తే..

*జేడీయూ (JDU) -13-14 మంది (ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా)
*బీజేపీ (BJP)- 15 - 16 మంది (ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందున)
*లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJPR)- 3 మంత్రి పదవులు
*హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM)- 1 మంత్రి
*రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)- 1 మంత్రి

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎవరు?
నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉంది. బీజేపీ, లోక్‌జనశక్తి పార్టీ (R) నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎంగా ఉంటారనే ఫార్ములా చర్చలో ఉంది. బీజేపీ తరఫున సమ్రాట్ చౌదరి మళ్లీ డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. చిరాగ్ పాశ్వాన్ పార్టీ నుంచి ఒక డిప్యూటీ సీఎంగా ఉండవచ్చు. అలాగే గతంలో స్పీకర్‌గా పనిచేసిన విజయ్ సిన్హాకు డిప్యూటీ సీఎం పదవి కాకుండా.. మరోసారి అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కుటుంబ సభ్యులకు మంత్రివర్గంలో స్థానం?
ఈ కొత్త మంత్రివర్గంలో కొందరు ప్రముఖ నాయకుల కుటుంబ సభ్యులకు కూడా స్థానం దక్కే అవకాశం ఉంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధినేత ఉపేంద్ర కుష్వాహా సతీమణి స్నేహ లతా దేవికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది.జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్‌కు హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చల తర్వాత అధికారికంగా వెలువడనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+