రూ.300 కోసం అలా చేస్తున్నారు: నిత్యానంద సంచలనం

Nityananda Swamy make again controversial comments
బెంగళూరు: వివాదాస్పద నిత్యానంద స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఆయనకు వ్యతిరేకంగా చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటిపై ఆయన విరుచుకుపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి చిక్కుల్లో పడ్డారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఉద్దేశ్యపూరితమైనవి కావన్నారు.

కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారంతూ రూ.300 కోసం ఆశపడేవారేనని విమర్శించారు. మూడు గంటల ఆందోళన కోసం ఆ మొత్తం తీసుకుంటున్నారే గానీ, వారికి తన పైన ఏమాత్రం కోపం లేదన్నారు. నిరసనలకు నేతృత్వం వహించే వారు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

తాను ఆశ్రమం లోపలే ఉన్నా, తన కోసం ఆందోళనకారులు బయట నిలబడి వేచి చూస్తుంటారని విమర్శించారు. మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఆయన భక్తులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కన్నడ సంఘాలు మరోసారి మండిపడుతున్నాయి.

కాగా, నిత్యానందకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ కేసు విషయంలో నిత్యానందకు ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా, ఆగస్టు 6న నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+