రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు అస్సలు లేవన్న సీనియర్ నేత
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు మనసు మార్చుకుంటారా అని ప్రశ్నించినప్పుడు వీరప్ప మొయిలీ ఈ సమాధానం చెప్పారు. ఏదైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఈ అంశంపై చర్చిస్తోందని వీరప్పమొయిలీ చెప్పారు.
ఇక కాంగ్రెస్ టాప్ పోస్టు కోసం మరొకరి పేరు ప్రతిపాదించే ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించడం జరగుతుందని మొయిలీ అన్నారు. ఇంకా సీడబ్ల్యూసీ రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించలేదని చెప్పారు. అప్పటి వరకు ఇలాంటి వార్తలు ప్రచారంలో ఉండనే ఉంటాయని మొయిలీ చెప్పారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో సమూల మార్పులు రావాలంటే అది అగ్రనాయకత్వం నుంచే ప్రారంభం కావాలని పేర్కొంటూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Recommended Video


కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షపదవికి సరైన వ్యక్తి దొరికేవరకు ఆ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అధ్యక్షపదవిలో కొనసాగుతేనే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ఆయన ఇంటికి క్యూ కట్టారు నేతలు. ఎవరు ఎన్ని విధాలా ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం తన మొండి పట్టుదలను వీడటం లేదు. తన రాజీనామాను ఆమోదించాలనే చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అతని సోదరి ప్రియాంకా గాంధీ చేపడుతారా అని మొయిలీని అడుగగా ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవడంతో పార్టీకి మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని మొయిలీ రెండు వారాల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications