ఎవరి దుస్తులు వారిష్టం, అశ్లీలమనిపిస్తే: గోవా సిఎం
పనాజీ: గోవాలో ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చునని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ స్పష్టం చేశారు. దుస్తుల వ్యవహారంలో మితీమీరిన అశ్లీలత అనిపిస్తే ఎవరైనా కేసు నమోదు చేసుకోవచ్చని ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యుడు అలెక్సో లారెన్కో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ - అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళలను వేధిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పరిక్కర్ అన్నారు.

అభ్యంతరకరమైన దుస్తులు ధరించారని కేసులో ఎవరైనా కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లవచ్చని పరిక్కర్ సూచించారు. గోవాలో బికినీ, మినీ స్కర్టులను నిషేధించాలని గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వస్త్రధారణ విషయంలో ప్రభుత్వ విధానం ఏదీ మారలేదని పరిక్కర్ చెప్పారు. పర్యాటక స్థలంలో నైతికమైన పోలీసింగ్‌ను అనుమతించబోమని ఆయన అన్నారు. పబ్ కల్చర్ అంటే ఏమిటనేది ప్రజలకు స్పష్టత వచ్చేవరకు దానిపై ప్రభుత్వ వైఖరి చెప్పబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications