గాంధీపై వ్యాఖ్యలు: రైటర్ అరుంధతీ రాయ్‌పై నో కేసు
తిరువనంతపురం: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌పై కేసు పెట్టాల్సిన అవసరం లేదని కేరళ గాంధీ స్మారక నిధి సంస్థ తెలిపింది. ఆమెపై కేసు పెట్టాలనే పోలీసుల ఆలోచనను సంస్థ వ్యతిరేకించింది. అయితే, అరుంధతీ రాయ్ తన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది.
ప్రజాస్వామ్యంలో అంగీకరించే, వ్యతిరేకించే స్వేచ్ఛ ఉంటుందని కేరళ గాంధీ స్మారక నిధి వర్కింగ్ చైర్మన్ ఎన్ రాధాకృష్ణన్, కార్యదర్శి కెజి జగదీష్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అరుంధతీ రాయ్‌కు భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరు కూడా కాదనడానికి లేదని భారత గాంధీ అధ్యయన మండలి చైర్మన్ కూడా అయిన రాధాకృష్ణన్ అన్నారు.

కొంత మంది చప్పట్ల కోసం ఏదో ఒకటి మాట్లాడేయడం సరి కాదని ఆయన అన్నారు. గాంధీ విమర్శలకు అతీతుడని తాము అనుకోవడం లేదని కూడా ఆయన అన్నారు. ఆఫ్రికాలో 1894లో ప్రజా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి గాంధీ కార్యాలపై విమర్శలు, విభిన్నమైన అంచనాలు వస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.
గాంధీపై విమర్శలు కొత్తవేమీ కావని, అందులో తప్పు కూడా ఏమీ లేదని, అయితే ఆ విమర్శలు చరిత్రను వక్రీకరించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. గత నెలలో అరుంధతీ రాయ్ కేరళ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం క్లిప్పింగుల కోసం పోలీసులు ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా అరుంధతీరాయ్‌పై కేసు పెట్టవచ్చా లేదా అనేది పరిశీలించడానికి వాటిని తీసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications