'సుజనాకు సంబంధం లేదు, నోటీస్ అందలేదు'

హైదరాబాద్: కేంద్ర మంత్రి వైఎస్ (సుజనా) చౌదరికి మారిషస్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్‌తో, ఆ కంపెనీ చేసిన రుణాలతో ఎటువంటి సంబంధం లేదని, ఆ కంపెనీలో ఆయన వాటాదారుడుగా కాని డైరెక్టర్‌గా కాని లేరని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు పి.అఫ్సర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.

హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే కంపెనీ మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 106 కోట్ల రూపాయల రుణం తీసుకుందని, దీనికి సంబంధించి కోర్టు నుంచి వైఎస్ చౌదరి నోటీసులు అందుకున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. వ్యక్తిగతంగా లేక మరో హోదాలో కూడా చౌదరి నోటీసులు అందుకోలేదన్నారు. రుణం తీసుకున్న, గ్యారంటీగా ఉన్న కంపెనీకి మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి నోటీసు వచ్చిందని, దీనికి సంబంధించి ఆ కంపెనీ కోర్టులో కౌంటర్‌ను దాఖలు చేసిందని తెలిపారు.

Sujana chowdhari

మారిషస్‌లో హెస్టియా హోల్డింగ్‌‌స లిమిటెడ్‌ మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ (ఎంసిబి) నుంచి తీసుకున్న రూ. 106 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణకు సంబంధించిన వ్యవహారంలో సుజనా చౌదరికి కోర్టు నుంచి నోటీసులు అందాయంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హెస్టియా సంస్థ తీసుకున్న రుణానికి సుజన యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ గ్యారంటీని సమకూర్చినట్లు ఆ వార్తకథనాలు వెలువడ్డాయి.

సుజనాకు సదరు సంస్థ తీసుకున్న రుణాలతో కూడా ఏమాత్రం సంబంధం లేదని, ఆయన రుణ గ్రహీత సంస్థలో డైరెక్టర్‌ గాని, వాటాదారు గాని కారని కూడా ఎస్‌యుఐఎల్‌ తన ప్రకటనలో స్పష్టం చేసింది. నోటీసులను అందుకున్నది రుణ గ్రహీత సంస్థ, గ్యారంటర్‌ సంస్థ అని ఎస్‌యుఐఎల్‌ ఈ ప్రకటనలో తెలిపింది. గ్యారంటర్‌ సంస్థను మూసివేసినందుకు మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ తరఫున దరఖాస్తు ప్రతిని గ్యారంటర్‌ సంస్థ అందుకుందని, అందుకు సంస్థ గౌరవనీయ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిందని ఎస్‌యుఐఎల్‌ ఆ ప్రకటనలో వివరించింది. ఆ వార్తలపై స్పష్టీకరణ ఇచ్చే నిమిత్తం ఈ ప్రకటనను జారీ చేస్తున్నట్లు ఎస్‌యుఐఎల్‌ తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+