కొత్త రూ. 10నోటు వచ్చేసింది: ఫీచర్లు ఇలా..
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్ కొత్త రూ.10 నోట్లను శుక్రవారం విడుదల చేసింది. చాకొలెట్ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్ ఆలయం డిజైన్ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
కొత్త రూ.10 నోటు ఫీచర్లు గమనించినట్లయితే.. పాత నోటులో '10' సంఖ్య మధ్యలో ఉండేది. కానీ, ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు. గాంధీ బొమ్మను కూడా మధ్యలో ముద్రించారు.

ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తును ముద్రించారు. ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు. కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు.
నోటులో స్వచ్ఛ భారత్ లోగో కూడా కన్పిస్తోంది. ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది. కాగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50ల కొత్త నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కొత్త రూ.10ల నోటును ఆర్బీఐ విడుదల చేసింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications