నీట్, జేఈఈ మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల: పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలివే
న్యూఢిల్లీ: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా, ప్రకటించింది. నీట్(NEET), జేఈఈ (JEE), సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకారం.. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జేఈఈ మెయిన్ మొదటి విడత (Session 1) పరీక్షలు జరగనున్నాయి. ఈ మొదటి విడత పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ రెండో విడత (JEE Main Session 2) పరీక్షలు జరగనున్నాయి.

2024 మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఇది పెన్ పేపర్/ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది. ఇక, 2024 మే 15 నుంచి 31 మధ్య యూనివర్సిటీల యూజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. 2024 మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.
2024 జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. కాగా, పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సమయంలో అభ్యర్థులకు వెల్లడిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపే.. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.
నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను అదే ఏడాది జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. పరీక్షలకు సంబంధించి ఇతర పూర్తి సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్ అయిన www.nta.ac.in సందర్శించాలని సూచించింది. కాగా, భారత ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ అధ్వర్యంలో నేషనన్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఏటా నీట్, జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి తదితర పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications