పన్నీరు వైపు మరో ఎమ్మెల్యే: శశికళకు చెక్ చెప్పేందుకు 'సీఎం'పై కొత్త వ్యూహం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: పన్నీర్ సెల్వంకు శక్రవారం నాడు మరో ఎమ్మెల్యే మద్దతు పలికారు. మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజన్‌ పన్నీర్‌ సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. నటరాజన్‌ చేరికతో పన్నీర్‌ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య పదకొండుకు చేరింది.

శనివారం అసెంబ్లీలో బలనిరూపణ జరగనున్న నేపథ్యలో వీలైనంత మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని పళనిస్వామి షాకిచ్చేందకు పన్నీర్ సెల్వం, ఆయన వర్గం వ్యూహాలు రచిస్తోంది.

శశికళకు పన్నీరు గట్టి షాక్: జయలలితకు ఇచ్చిన మాట తప్పారని తొలగింపు

పన్నీరు సెల్వంకు ఎలాగు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదు. కాబట్టి కనీసం.. పన్నీరు వైపు ఎమ్మెల్యేలను రప్పించడం ద్వారా శశికళ అనుచరుడైన.. సీఎం పళనిస్వామికి చెక్ చెప్పాలని భావిస్తోంది. శనివారం నాడు పళనిస్వామి తన బలం నిరూపించుకోనున్నారు.

O Panneerselvam faction try take control over admk party

కాగా, అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే తమది అంటే తమది అని పన్నీరు.. శశికళ వర్గీయులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఒకరి పైన మరొకరి వర్గం వేటు వేసుకుంటోంది.

మరోవైపు, పన్నీరు సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. జయలలితకు, పార్టీకి శశికళ వర్గీయుల చేస్తున్న అన్యాయాన్ని వివరించనున్నారు. ఇప్పటికే పార్టీ పైన పట్టు కోసం పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
O,pannerselvam faction try to take control over AIADMK party and it's double leaf symbol.
Please Wait while comments are loading...