ఒడిసా రైలు ప్రమాదంలో ''పేలాలు'' ఏరుకుంటున్న మోసగాళ్లు
ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో కొన్ని మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ముఖం నలిగిపోవడంతోపాటు కాళ్లు, చేతులు తెగడంవల్ల కూడా మృతిచెందినవారి బంధువులు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారు. ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులుగా నమ్మించి మృతదేహాలు తీసుకువెళుతున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసం చోటుచేసుకుంటుండటంపై ఒడిసా ప్రభుత్వం అప్రమత్తమైంది. మోసానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా మృతులను ఉంచిన ప్రదేశానికి వచ్చి తన భర్త ఇదే రైల్లో ప్రయాణించారని, ఆచూకీ తెలియడంలేదని పోలీసులకు తెలిపింది.అక్కడున్న ఫొటోలను చూపించి ఆమె భర్త ఎవరో గుర్తించమని సూచించారు. కొన్ని ఫొటోలను చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపించి అతడే తన భర్త అని తెలిపింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించారు. తన భర్త బతికేవున్నాడని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఇలా చేసినట్లు అంగీకరించింది.

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో రైల్వేబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. ఒడిసా రైలు ప్రమాదంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అనంతరం జనరల్ మేనేజర్లు, డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సిగ్నల్ వ్యవస్థలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications