సీఎం సహా అనేక పదవులు ఆఫర్ చేశారు కానీ.. సోనూ సూద్
ప్రముఖ సినీనటుడు, కరోనావైరస్ కాలంలో పేద ప్రజలకు అనేక విధాలుగా సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూ సూద్ అనేక మందిని ఆదుకుని రియల్ హీరో కావడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. పలు రాజకీయ పార్టీలు కూడా ఆయనను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, సోనూ సూద్ మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు సోనూ సూద్. కోవిడ్ సమయంలో సాయం చేసినందుకు గానూ తనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని సోనూ సూద్ వెల్లడించారు.

నాకు సీఎం ఆఫర్ వచ్చింది.. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతామన్నారు. మరోవైపు, జాతీయ నాయకులు నాయకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారు. అయితే, ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా అని సోనూ సూద్ పేర్కొన్నారు.
ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం.. వాటిలో తనకు దేనిపైనా ఆసక్తి లేదని చెప్పారు. ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. అది తాను ఇప్పటికే చేస్తున్నట్లు సోనూ సూద్ తెలిపారు. అయితే, తనకు ఏ పార్టీ ఈ పదవులను ఆఫర్ చేసిందనేది మాత్రం చెప్పలేదు.
మరోవైపు, సోనూ సూద్ సోదరి మాళవిక 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ తరపున పంజాబ్ అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. కాగా, కరోనా మహమ్మారి సమయంలో సోనూ సూద్ పేద ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు అనేక విధాలుగా సాయం చేసిన విషయం తెలిసిందే. ఎవరు సాయం కావాలని అడిగినా అందించారు. విదేశాల్లో చిక్కుకున్న వారికి కూడా సాయం చేశారు. పలువురిని బస్సుల్లో తమ సొంత గ్రామాలకు తరలించారు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications