వెంటాడి వెంటాడి లైంగిక వేధింపులు: ఓలా డ్రైవర్ అరెస్టు

ముంబై: మహిళా ప్రయాణికురాలిని వెంటాడి వెంటాడి లైంగిక వేధింపులకు గురి చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ ను ముంబై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఓలా క్యాబ్ డ్రైవర్ తరచూ ఫోన్ చేస్తూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు ముంబై నగర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ తివారి (50) అనే డ్రైవర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగినిగా పని చేస్తున్న మహిళ (30) గత శనివారం సాయంత్రం ముంబై లోని పొవై ప్రాంతం నుంచి ఇంటికి బయలుదేరారు.

అంతకు ముందే క్యాబ్ బుక్ చేసుకున్నారు. అక్కడికి ఓలా క్యాబ్ డ్రైవర్ తివారీ వెళ్లాడు. లాంగ్ రూట్ లో ఆమెను గమ్య స్థానానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో తరచూ ఆమెను అద్దంలో చూస్తూ వేధించాడు. తన కారును ఓవర్ టేక్ చేసిన వారిని బూతులు తిట్టాడు.

Ola driver arrested for molesting, stalking passenger

క్యాబ్ గమ్యస్థానానికి చేరిన తరువాత తివారీని హద్దుల్లో ఉండాలని మహిళా ప్రయాణికురాలు హెచ్చరించారు. దీంతో రెచ్చిపోయిన తివారీ ఆమెను వెంటాడు. ఆమె అపార్ట్ మెంట్ లిఫ్ట్ వరకు వెళ్లి నానా బూతులు తిట్టాడు. తరువాత ఆమెకు తరచూ ఫోన్ లు చేస్తూ వేధింపులకు గురి చేశాడు.

బాధితురాలు తివారీ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. అయినా నిత్యం కొత్త ఫోన్ నెంబర్లతో ఆమెకు ఫోన్ చేస్తూ బండ బూతులు తిడుతూ వేధించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు తివారీని అరెస్టు చేశామని, గతంలో ఇతని మీద ఇలాంటి కేసులు నమోదు అయ్యాయని ముంబైలోని దీన్ దోషి పోలీస్ స్టేషన్ అధికారి గిరీష్ అనవ్కర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+