Movie Tickets: మల్టిప్లెక్స్ ల్లో మూవీ టికెట్ రూ.99 మాత్రమే..
సాధారణంగా మల్టిప్లెక్స్ ల్లో సినిమా చూడాలంటే టికెట్ ఎంత ఉంటుంది.. రూ. 150 నుంచి రూ.400 వరకు ఉంటుంది. కొన్ని పెద్ద సిటీల్లో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దీంతో పాటు మల్టిప్లెక్స్ పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఇతరు తినబండారాలకు కూడా భారీగానే ధర ఉంటుంది. డీ మార్ట్ లో రూ.35 లకు దొరికే పాప్ కార్న మల్టిప్లెక్స్ ల్లో రూ. 150 పైనే ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలు మల్టిప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూడడం తగ్గించారు. చాలా మంది ఓటీటీల్లో మూవీలు చూస్తున్నారు.
ముఖ్యంగా కరోనా నుంచి ఈ పద్ధతి పెరిగిపోయింది. అయితే ప్రతి సంవత్సరం నేషనల్ మూవీ డే రోజు మల్టిప్రెక్స్ లు టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మూవీ టికెట్లపై ఆఫర్లు ప్రకటించారు. అక్టోబర్ 13 నేషనల్ మూవీ డే సందర్భంగా సినిమా టికెట్ రేట్లను తగ్గించినట్లు మల్టీప్లెక్స్ పేర్కొన్నారు. ఆ రోజు ఏ మూవీకైనా కేవలం 99 రూపాయలకు మాత్రమే టికెట్లు విక్రయిస్తామని మల్టిప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది.

నేషనల్ వైడ్ గా ఉన్న మల్టీ ప్లెక్స్ లతో పాటుగా మరిన్ని థియేటర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ సారి దాదాపు 4000 థియేటర్లు ఈ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం స్పెషల్ షోస్ నిర్వహించగా 65 లక్షల టికెట్స్ విక్రయించినట్లు తెలిపింది. ఈ సారి అంతకు రెట్టింపు టికెట్స్ అమ్ముడవ్వడమే లక్షంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఆ సమయంలో మంచి సినిమాలు ఉంటే భారీగా టికెట్లు అమ్ముడు పోతాయని చెబుతున్నారు.
PVR INOX, Cinepolis, Miraj, Citypride, Asian, Mukta A2, Movie Time, Wave, M2K, Delite ఈ టికెట్ ఆఫర్లు ఉండనున్నాయి. అలాగే సీజ్ చేసిన థియేటర్లను కూడా తిరిగి తెరవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెలలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. రూ. 99 ఆఫర్ తో ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు చూసేయ్యొచ్చు సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications