Teenagers కు షాక్: పోర్న్ వీడియోలు చూస్తున్న 10 ఏళ్ల పిల్లలు
తెలిసీ తెలియని వయసు.. చేతిలో ఇంటర్నెట్.. స్మార్ట్‌ఫోన్, వెబ్‌సైట్లు బ్రౌజ్ చేస్తుంటే మెరిసే పాప్-అప్ లింకులు.. వీటిపై చేసే ఒక చిన్న 'క్లిక్' పచ్చని జీవితాన్ని చీకటిమయం చేస్తోంది. ఇటీవల యువత, ముఖ్యంగా 10 నుంచి 16 ఏళ్ల లోపు బాలలు చైల్డ్ పోర్న్ (చిన్నారుల అశ్లీల వీడియోలు) వీక్షణకు బానిసలవుతున్నారు. కేవలం చూడటమే కాకుండా, ఉత్సాహంతో ఇతరులకు షేర్ చేస్తూ కటకటాల పాలవుతున్నారు.
చాలామంది యువకులు తాము రహస్యంగా అశ్లీల వీడియోలు చూస్తున్నామని, ఎవరికీ తెలియదని భ్రమపడుతుంటారు. కానీ, ఇంటర్నెట్‌లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను ఎవరు చూసినా, అప్‌లోడ్ చేసినా అంతర్జాతీయ సంస్థ 'ఎన్‌సీఎంఈసీ' (NCMEC) వెంటనే పసిగడుతుంది. ఆ సమాచారాన్ని తక్షణమే స్థానిక పోలీసులకు చేరవేస్తుంది.

Teenagers పై సోషల్ మీడియా ప్రభావం..
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియోను స్నేహితుడికి పంపిన విజయవాడకు చెందిన ఒక యువ డ్రైవర్‌పై ఐటీ చట్టం కింద కేసు నమోదు కావడమే దీనికి నిదర్శనం. ప్రయోజకులు కావాల్సిన వయసులో, ఇలాంటి కేసుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడమే కాకుండా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడ నగరంలో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 678 మందిపై ఇలాంటి కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఐదేళ్ల జైలు.. రూ. 10 లక్షల జరిమానా!
చిన్నారుల అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను సేకరించడం, దాచుకోవడం, ఇతరులకు పంపడం ఐటీ చట్టం సెక్షన్ 67 (బి) మరియు పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల భారీ జరిమానా విధిస్తారు. అదే తప్పు రెండోసారి పునరావృతమైతే ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదు. డిజిటల్ ప్రపంచంలో మీరు వదిలే ప్రతి అడుగు నిఘాలోనే ఉంటుందని, కేవలం ఒక షేర్ లేదా ఒక డౌన్‌లోడ్ మీ భవిష్యత్తును బూడిద చేస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Teenagers పట్ల తల్లిదండ్రులూ జాగ్రత్త!
పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేటప్పుడు వారు ఏ వెబ్‌సైట్లు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారనేది గమనించడం అత్యవసరం. వెబ్‌లో వచ్చే అశ్లీల పాప్-అప్‌లకు దూరంగా ఉండాలని వారికి అవగాహన కల్పించాలి. సరదాగా చేసే పనులు నేరాల కిందకు వస్తాయని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ ప్రపంచంలో అజ్ఞానం శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడలేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications