ఈ జీవితానికి పెళ్లి వద్దు బాబోయ్ వద్దు..!

ఒకప్పుడు 18 ఏళ్లు దాటితే చాలు, యువతలో పెళ్లి చేసుకోవాలనే ఆరాటం, తల్లిదండ్రులలో వారికి పెళ్లి చేయాలనే ఆకాంక్ష బలంగా ఉండేది. కానీ ఆధునిక సామాజిక పరిస్థితులు మరియు వ్యక్తిగత అవసరాల కారణంగా ఈ ప్రాధాన్యతలు గణనీయంగా మారుతున్నాయి. భారతదేశంలో ఈ ధోరణి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాలలో ఇది విపరీతంగా పెరిగిపోతోంది.

కార్నెల్ యూనివర్సిటీ - ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ఒకరు వివాహం చేసుకోవడం కంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్\u200cలో దాదాపు 25% మంది వయోజనులు తమ జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకపోవచ్చని అంచనా వేసింది.

One in four people do not want to get married

ఈ ధోరణికి ప్రధాన కారణాలు:
యువతరం తమ కెరీర్\u200cకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఒకప్పుడు వివాహం చేసుకోకుండా ఉండటం సామాజిక కళంకంగా భావించేవారు. కానీ ఇప్పుడు అది వ్యక్తిగత సాధికారత కలిగిన జీవనశైలిగా పరిగణించబడుతోంది.ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా స్వాతంత్ర్యం సాధించడంతో, వివాహం ఒక ఆర్థిక భద్రతగా ఉండాలనే ఆలోచన తగ్గింది.

యువతీ యువకులు స్వేచ్ఛగా, తమకు నచ్చిన విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగా ఉండటమనేది ఇప్పుడు స్వయం సమృద్ధి , స్వేచ్ఛకు చిహ్నంగా మారింది.ఆధునిక సమాజంలో యువతరం ఆర్థిక భద్రత, కెరీర్, మరియు వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వివాహం పట్ల సాంప్రదాయ దృక్పథం మారుతూ, ఒంటరి జీవనం ఇప్పుడు ఒక గౌరవనీయమైన, స్వతంత్రమైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ధోరణి ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+