మహారాష్ట్రలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఒకరి మృతి, 10మందికి తీవ్రగాయాలు..

సోలాపూర్ : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. బ్యాంక్ బిల్డింగ్ పైకప్పు కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోగా.. 10 మంది గాయపడ్డారు. బిల్డింగ్ శిథిలాల కింద మరో 10 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సోలాపూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉదయం 11 గంటల సమయంలో బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకు రద్దీగా ఉన్న సమయంలో పైకప్పు కూలడంతో బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్లు గాయాలపాలయ్యారు. గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా బిల్డింగ్ డ్యామేజ్ అయి కూలిపోయిందని ప్రాథమికంగా నిర్థారించారు.

One killed, 10 injuredin Maharashtra bank roof collapse

పైకప్పు కూలిన ఘటనలో చనిపోయిన వ్యక్తిని ప్రశాంత్ బాఘల్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిలో 10 మందిని వెలికి తీసిన సహాయక సిబ్బంది గాయాలపాలైన వారిని హాస్పిటల్‌కు తరలించారు. మరో 10మంది అక్కడ చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పై భాగంలో చిన్న క్లీనిక్ నడుపుతున్నారు. పై కప్పు కూలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న పేషెంట్లు కింద పడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+