Sadist: కాలేజ్ అమ్మాయి, చచ్చినా లవ్ చెయ్యనని చెప్పింది, కత్తితో పొడిచి చెయ్యి నరికేసిన సైకో, వన్ సైడ్ లవ్ !

అహమ్మదాబాద్/వడోదరా: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి అందం చూసి ఆమెను ప్రేమించాలని ఓ యువకుడు అనుకున్నాడు. రెండు సంవత్సరాలు ఆమె వెంట తిరిగిన యువకుడు ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే అమ్మాయి మాత్రం అతని ప్రేమను అంగీకరించలేదు. రెండు సంవత్సరాలు మాయం అయిన యువకుడు మళ్లీ ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. నాలుగు సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వుకూడా నన్ను ప్రేమించాలని ఆ యువకుడు ఆమెకు చెప్పాడు. అయితే యువకుడిని ప్రేమించడానికి కాలేజ్ అమ్మాయి నిరాకరించింది.

ఈ జీవితంలో నిన్ను ప్రేమించనని ఆమె తేల్చి చెప్పింది. నాలుగేళ్ల నుంచి వన్ సైడ్ లవ్ తో అతను విసిగిపోయాడు. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయి మరో యువకుడితో మాట్లాడటం మొదలు పెట్టింది. ఈ విషయం జీర్ణించుకోలేని ఆ యువకుడు కాలేజ్ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. కాలేజ్ అమ్మాయిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు అంతటితో ఆమెను వదిలిపెట్టకుండా ఆమె చెయ్యి కూడా నరికేశాడని పోలీసులు అన్నారు. లేడీ పోలీసు అధికారి కావాలని ఆశపడిన యువతి సైకో వన్ సైడ్ లవర్ చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది.

 కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

గుజరాత్ లోని వడోదరా నగరంలో కల్పేష్ ఠాకూర్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వడోదరాలోనే త్రిషా సోలంకి (19) అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి త్రిషా సోలంకి అందం చూసి ప్రేమిస్తే ఆమెను ప్రేమించాలని కల్పేష్ ఠాకూర్ అనుకున్నాడు.

 కొన్ని సంవత్సరాలు వన్ సైడ్ లవ్

కొన్ని సంవత్సరాలు వన్ సైడ్ లవ్

రెండు సంవత్సరాలు త్రిషా సోలంకి వెంట తిరిగిన కల్పేష్ ఠాకూర్ ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే కాలేజ్ అమ్మాయి త్రిషా మాత్రం కల్పేష్ ఠాకూర్ ప్రేమను అంగీకరించలేదు. రెండు సంవత్సరాల పాటు వేరే ఊరికి వెళ్లిపోయిన కల్పేష్ ఠాకూర్ మళ్లీ త్రిషా ముందు ప్రత్యక్షం అయ్యాడు.

 జీవితంలో ప్రేమించనని తేల్చి చెప్పిన అమ్మాయి

జీవితంలో ప్రేమించనని తేల్చి చెప్పిన అమ్మాయి

నాలుగు సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వుకూడా నన్ను ప్రేమించాలని కల్పేష్ ఠాకూర్ అతను ప్రేమిస్తున్న త్రిషాకు చెప్పాడు. అయితే కల్పేష్ ఠాకూర్ ను ప్రేమించడానికి కాలేజ్ అమ్మాయి త్రిషా నిరాకరించింది. ఈ జీవితంలో నిన్ను ప్రేమించనని త్రిషా ఆమె వెంటపడుతున్న కల్పేష్ ఠాకూర్ కు తేల్చి చెప్పింది.

 పక్కా స్కెచ్ వేసిన వన్ సైడ్ లవర్

పక్కా స్కెచ్ వేసిన వన్ సైడ్ లవర్

నాలుగేళ్ల నుంచి వన్ సైడ్ లవ్ తో త్రిషా విషయంలో కల్పేష్ ఠాకూర్ విసిగిపోయాడు. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయి త్రిషా కాలేజ్ లో చదువుతున్న మరో యువకుడితో మాట్లాడటం మొదలు పెట్టింది. ఈ విషయం జీర్ణించుకోలేని కల్పేష్ ఠాకూర్ కాలేజ్ అమ్మాయితో మాట్లాడాలని చెప్పాడు. చివరిసారి నాతో మాట్లాడాలని కల్పేష్ ఠాకూర్ త్రిషాను నమ్మించాడు.

 చంపేసి చేతులు దులుపుకున్న సైకో లవర్

చంపేసి చేతులు దులుపుకున్న సైకో లవర్

వడోదరాలో త్రిషాను కత్తితో పదేపదే పొడిచి దారుణంగా హత్య చేసిన కల్పేష్ ఠాకూర్ ఆమె శవాన్ని వడోదరా సిటీ సమీపంలోకి తీసుకెళ్లాడు. కాలేజ్ అమ్మాయి త్రిషాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు కల్పేష్ ఠాకూర్ అంతటితో ఆమెను వదిలిపెట్టకుండా ఆమె చెయ్యి కూడా నరికేశాడని పోలీసు అధికారులు అన్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

 పోలీసు అధికారి కావాలని ఆశపడిన కాలేజ్ అమ్మాయి

పోలీసు అధికారి కావాలని ఆశపడిన కాలేజ్ అమ్మాయి

చదువు పూర్తి చేసి ఎప్పటికైనా లేడీ పోలీసు అధికారి కావాలని ఆశపడిన త్రిషా వన్ సైడ్ సైకో లవర్ కల్పేష్ ఠాకూర్ చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి త్రిషాను దారుణంగా హత్య చేసిన సైకో కల్పేష్ ఠాకూర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తనను ఇంతకాలం వెంట తిప్పుకుని చివరికి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే త్రిషాను హత్య చేశానని కల్పేష్ ఠాకూర్ పోలీసుల విచారణలో అంగీకరించాడని పీటీఐ వార్తా సంస్థ మీడియాకు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+