వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి నార్మల్ గా జరిగితే ఏముంటుంది కిక్కు.. అందుకే ఇలా.. (వీడియో)

త‌న పెళ్లి అందరిలా నార్మ‌ల్ గా జ‌రిగితే ఏముంటుంది కిక్.. అనుకుందో ఏమోగానీ ఢిల్లీకి చెందిన .. ఓ యువతి త‌న పెళ్లిని స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా మార్చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త‌న పెళ్లి అందరిలా నార్మ‌ల్ గా జ‌రిగితే ఏముంటుంది కిక్.. అనుకుందో ఏమోగానీ ఢిల్లీకి చెందిన .. ఓ యువతి త‌న పెళ్లిని స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా మార్చేసింది. పెళ్లి కి ముందు జ‌రిగే వేడుకకు సంబంధించి ఓ వీడియోను రికార్డు చేయించింది.

ఆ వీడియో స్పెషాలిటీ ఏంటంటే.. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మొత్తం ఆ వీడియోలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అంతే కాదు.. ఏక‌ధాటిగా మూడు నిమిషాలా నలభై నాలుగు సెక‌న్లు ఆప‌కూండా, ఎటువంటి క‌ట్స్ లేకుండా సింగిల్ షాట్ లో వీడియోను షూట్ చేయ‌డం దీని గొప్ప‌ద‌నం.

బాలీవుడ్ మూవీ 'బార్ బార్ దేఖో' లోని 'నాచ్ దే నే సారే' పాటకు పెళ్లి కూతురు స‌హా ఆమె బంధువులంతా క‌లిసి చేసిన డ్యాన్స్ కూడా వెరైటీగా ఉండ‌టంతో ఈ వీడియో పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు. ఈ వీడియోను మ్యాజిక్ మోషన్ మీడియా సంస్థ చిత్రీకరించి సోషల్ మీడియాలోకి అప్ లోడ్ చేసింది.

ఈ వీడియోకు ఇప్పటికే యూట్యూబ్ లో మూడు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఫేస్ బుక్ లో అయితే ఈ వీడియోను ఇప్పటి వరకు 9 లక్షల మంది చూశారు. ఈ అద్భుత వీడియోను తీసినందుకు ఒక్క పెళ్లికూతురినే కాదు, ఇందులో నటించిన ఆమె కుటుంబ సభ్యులందరినీ నెటిజన్లు అభినందిస్తున్నారు.

English summary
The big fat Indian wedding spectacle got even more fun with this bride's wonderful dance video. Bride Dalia Benedict's dance video for her haldi ceremony was shot entirely in one go, without any cuts, to one of the hottest wedding tracks from last year: Nachde Ne Saare from Baar Baar Dekho. But that's not all, for she got her whole family to dance with her for the video. This means parents, siblings, aunts, uncles and cousins, all matching steps with the happy bride in matching yellow and white outfits. Shot and uploaded by Magic Motion Media, the one-shot video has been viewed over 3 lakh times on YouTube and 9 lakh times on Facebook, with many congratulating not just the bride-to-be but the whole production team and the family for their performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X