Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హలో అంటూ ఫోన్ కాల్, సెకండ్ హ్యాండ్ మొగుడు వద్దు, పెళ్లి క్యాన్సిల్, అదే ముహుర్తానికి!

బెంగళూరు: హలో అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చెయ్యడంతో ఈ రోజు జరగవలసిన పెళ్లి రద్దు అయ్యింది. తనకు సెకండ్ హ్యాండ్ మొగుడు వద్దని పెళ్లి కూతురు తేల్చి చెప్పడంతో అదే ముహూర్తానికి వేరే యువకుడితో అమ్మాయి మెడలో తాళి కట్టించారు. తనకు అన్యాయం చేశారని, తనకు ఏ పాపం తెలీదని వరుడు పోలీసుల దగ్గర లబోదిబోమన్నాడు. అయితే పోలీసులు సైతం మేము ఏమీ చెయ్యలేమని, మీ బాదలు మీరు పడండి అంటూ చేతులు ఎత్తేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణలో జరిగింది.

ఘనంగా రిసెప్షన్

ఘనంగా రిసెప్షన్

రామనగర జిల్లా చెన్నపట్టణ తాలుకా తిట్టమారనహళ్ళిలోని చేతన్ సముదాయ భవనంలో బసవరాజు, భాగ్యశ్రీ పెళ్లి చెయ్యడానికి ఇరు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి బసవరాజు, భాగ్యశ్రీ పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. వరుడు, వదువు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వందల సంఖ్యలో పెళ్లి రిసెప్షన్ కు హాజరైనారు.

హలో అంటూ ఫోన్ కాల్

హలో అంటూ ఫోన్ కాల్

గురువారం రాత్రి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. హలో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, బసవరాజ్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యింది. బసవరాజ్ కు భార్య, పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి బసవరాజ్ తో రెండో పెళ్లి చేస్తారా ? అ అమ్మాయి జీవితం నాశనం చెయ్యకండి అంటూ ఆ వ్యక్తి ఫోన్ కాల్ కట్ చెయ్యడంతో భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

సెకండ్ హ్యాండ్ మొగుడు

సెకండ్ హ్యాండ్ మొగుడు

విషయం తెలుసుకున్న భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. ఇంతకు ముందే బసరాజ్ కు పెళ్లి అయ్యిందని తెలుసుకున్న భాగ్యశ్రీ తనకు సెకండ్ హ్యాండ్ మొగుడు వద్దని తేల్చి చెప్పింది. వెంటనే పెళ్లి నిలిపివేయాలని భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

పెళ్లి కొడుకు పంచాయితి

పెళ్లి కొడుకు పంచాయితి

పెళ్లి ఎందుకు నిలిపివేయాలి అని మీరు అంటున్నారు అని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వాదించారు. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు తమకు ఫోన్ చేసిన వ్యక్తి బసవరాజ్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, భార్య, పిల్లలు ఉన్నారని చెప్పారని సమాధానం ఇచ్చారు. తనకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని మీరు నిరూపించాలని, అన్యాయంగా తన మీద నిందలు వెయ్యకూడదని, తన భార్య, పిల్లలు ఎక్కడ ఉన్నారో మీరే చెప్పండి అంటూ బసవరాజ్ నానా హంగామా చేశాడు..

అదే ముహుర్తానికి వేరే వ్యక్తితో పెళ్లి

అదే ముహుర్తానికి వేరే వ్యక్తితో పెళ్లి

శుక్రవారం వేకువ జామున వరకు చెన్నపట్టణ తూర్పు పోలీస్ స్టేషన్ లో బసవరాజ్, భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. మాకు ఈ పెళ్లి వద్దేవద్దు అంటూ భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెబితే మీరు ఎలా నమ్ముతారని బసవరాజ్ కుటుంబ సభ్యులు వాదించారు. ఆ పురాణం అంతా మాకు వద్దు, ఈ పెళ్లి జరగదు అని భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అదే పెళ్లికి వచ్చిన చెన్నపట్టణ తాలుకా ఎలేకేరి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో ముందుగా అనుకున్న ముహూర్తానికి భాగ్యశ్రీ మెడలో తాళి కట్టించారు. మొత్తం మీద అనామకులు ఫోన్ చెయ్యడంతో బసవరాజ్ పెళ్లి పెటాకులైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+