నా నగ్న ఫోటోలు భర్తే నెట్లో పెట్టాడు: కిస్ఆఫ్‌లవ్ ట్విస్ట్

కొచ్చి: 'కిస్ ఆఫ్ లవ్' కేసులో కొత్త ట్విస్ట్. 'కిస్ ఆఫ్ లవ్' ఆర్గనైజర్‌ను ఆయన భార్య కూడా తప్పుబట్టింది. ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని కిస్ ఆఫ్ లవ్ ఆర్గనైజర్ రాహుల్ పసుపాలన్‌ను, ఆయన భార్య రష్మీని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను మరిన్ని చిక్కుల్లో పడ్డాడు.

స్థానిక మీడియా ప్రకారం... ఆయన భార్య రష్మీ ఆర్ నాయర్ కూడా అతనిని కార్నర్ చేసింది. తన భర్త (రాహుల్ పసుపాలన్) తనను బలవంతంగా సెక్స్ రాకెట్లోకి దింపాడని ఆమె ఆరోపించింది.

Online Sex Racket: Wife corners hubby

రష్మీ, రాహుల్‌లు ఇటీవల కిస్ ఆఫ్ లవ్ నిర్వహించి ప్రాచుర్యంలోకి వచ్చారు. కేరళలో మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ వారు కిస్ ఆఫ్ లవ్ నిర్వహించారు. ఆ తర్వాత కిస్ ఆఫ్ లవ్ దేశవ్యాప్తంగా పలుచోట్ల నిర్వహిస్తున్నారు.

అయితే, రష్మీ, రాహుల్‌లకు ఇటీవలే పోలీసులు షాకిచ్చారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తన భర్త తనను బలవంతంగా సెక్స్ రాకెట్లోకి దించారని రష్మీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలున్నాయి.

Online Sex Racket: Wife corners hubby

సమాచారమే మేరకు... రష్మీ తన భర్త రాహుల్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్ కోసం రాహుల్ తన నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో పెట్టాడని, హైప్రొఫైల్ వాళ్లతో సంబంధాలు నెరిపాడని ఆమె ఆరోపించినట్లుగా తెలుస్తోంది.

రాహుల్.. రష్మీ పేరిట ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి... పలు అభ్యంతరకర చిత్రాలు పోస్ట్ చేశాడు. యువతులు, మైనర్ గర్ల్స్ ఫోటోలు పెట్టేవాడు. దీంతో, పోలీసులు రష్మీ, రాహుల్‌తో పాటు మరో పదిమందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఎనిమిది మంది మహిళలు, అందులో బెంగళూరుకు చెందిన మైనర్ బాలిక ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+