వాన్నాక్రై ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా ఏటీఎంల మూసివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రపంచవ్యాప్తంగా వాన్నాక్రై అల్లకల్లోలం సృష్టిస్తోంది. వాన్నాక్రై ప్రభావం బ్యాంకింగ్‌ నెట్ వర్క్ పైన పడకుండా ఆర్బీఐ తాజాగా చర్యలు చేపట్టింది.

మాల్‌వేర్‌ నుంచి రక్షించేందుకు విండోస్‌ అప్‌డేషన్‌ వచ్చే వరకు అన్ని ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో దేశవాప్తంగా భారీగా ఏటీఎంలు మూతపడనున్నాయి.

దేశంలో దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పని చేస్తున్నాయి. వీటిల్లో అరవై శాతం అంటే 2.25లక్షల ఏటీఎంలు అవుట్‌డేటెడ్‌ విండోస్‌ ఎక్స్‌పీపైనే అధారపడుతున్నాయి.

Open ATMs only after software update: RBI

ప్రస్తుతం మాల్‌వేర్‌ వ్యాపించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఎక్స్‌పీ కూడా ప్రత్యేకమైన అప్‌డేట్‌ ఇస్తానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు అత్యవసరంగా విండోస్‌ ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

దీంతో బ్యాంకులు తమ సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలను జారీ చేశాయి. ఏటీఎం యంత్రాల్లో ఎటువంటి డేటా నిల్వ చేయడానికి అవకాశముండదని, కాబట్టి వాన్నక్రై బారిన పడే అవకాశముండదని అంటున్నారు. ఒకవేళ ఏటీఎం యంత్రాలు వాన్నాక్రై బారిన పడినా రీఫార్మాట్‌ చేసి వాడుకోవచ్చని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The RBI has directed banks to operate their ATM networks only after machines receive a Windows update to protect them from a malware impacting systems across the world.
Please Wait while comments are loading...