కక్షకట్టిన పన్నీర్ సెల్వం: చివరి నిమిషంలో రద్దు, అయ్యా మీరే దిక్కు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామి వర్గానికి సినిమా చూపిస్తోంది. నిమిషనిమిషానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎడప్పాడి పళనిసామికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.

గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం విలీనం అవుతాయని అందరూ భావించారు. ఆ దిశగానే పన్నీర్ సెల్వం గురువారం ఉదయం తన వర్గంతో అత్యవసర సమవేశం ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి సైతం ఆయన ఇంటిలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో బిజీబిజీగా గడిపారు.

కక్షకట్టిన పన్నీర్ సెల్వం

కక్షకట్టిన పన్నీర్ సెల్వం

శశికళ, ఆమె కుటుంబ సభ్వులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు పంపించాలని కక్షకట్టుకున్న పన్నీర్ సెల్వం చివరికి తాను అనుకున్నది సాదించారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వమే శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించేలా ప్లాన్ చేసిన పన్నీర్ సెల్వం చివరికి సక్సస్ అయ్యారు.

పన్నీర్ సెల్వం రూటే సపరేటు

పన్నీర్ సెల్వం రూటే సపరేటు

గురువారం ఉదయం తన వర్గంతో సమవేశం ఏర్పాటు చేసి విలీనంపై తుదినిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం చెప్పారు. అయితే గురువారం ఉదయం ఒక్క సారిగా అత్యవసర సమావేశం వాయిదా వేసిన పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామిని అయోమయంలో పడేశారు.

కొత్త డిమాండ్లు వస్తే ఏలా

కొత్త డిమాండ్లు వస్తే ఏలా

పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సమావేశం రద్దు చేసుకున్నారని, చర్చలు వాయిదా వేసుకున్నారని తెలుసుకున్న ఎడప్పాడి పళనిసామి వర్గం ఆందోళనకు గురైయ్యింది. ఇప్పుడు మళ్లీ పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు తెరమీదకు తెస్తారా ? అంటూ పళనిసామి వర్గీయులు టెన్షన్ పడిపోతున్నారు.

శశికళ వర్గంలో ఎవ్వరికీ నో చాన్స్

శశికళ వర్గంలో ఎవ్వరికీ నో చాన్స్

అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనం విషయంలో పన్నీర్ సెల్వం ఆలస్యం చెయ్యడానికి ఓ కారణం ఉందని తాజాగా వెలుగు చూసింది. శశికళను సీఎం చెయ్యాలని నినాదం తెరమీదకు తీసుకు వచ్చిన ముగ్గురు మంత్రులను దూరంపెట్టాలని షరత్తుపెట్టే అవకాశం ఉందని తెలిసింది.

హడలిపోతున్న మంత్రులు

హడలిపోతున్న మంత్రులు

ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి, టీటీవీ దినకరన్ అనుచరుడు విజయభాస్కర్ ను కచ్చితంగా దూరం పెట్టడానికి సిద్దం అయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులను బయటకు పంపించడానికి రంగం సిద్దం అయ్యింది.

నేను సీఎంగా ఉంటే చిన్నమ్మకు జై అంటారా !

నేను సీఎంగా ఉంటే చిన్నమ్మకు జై అంటారా !

సీఎంగా ఉన్న సమయంలో బహిరంగంగా మీడియా ముందు తనను వ్యతిరేకించి, శశికళను సీఎం చెయ్యాలని పదేపదే నినాదాలు చేసిన ముగ్గరు మంత్రులకు ఉద్వాసన పలకాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.

అందుకే వాయిదా వేస్తున్నారు

అందుకే వాయిదా వేస్తున్నారు

అన్నాడీఎంకేలో రెండు వర్గాలు విలీనం అయిన తరువాత ప్రభుత్వంలో పెత్తనం అంతా పన్నీర్ సెల్వం వర్గీయులదే ఉంటుందని స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే తన అనచురులకు కీలక మంత్రి పదవులు ఇవ్వాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు.

పన్నీర్ సెల్వమే దిక్కు

పన్నీర్ సెల్వమే దిక్కు

తమతో చేతులు కలపడానికి సిద్దం అయిన పన్నీర్ సెల్వం మాట విని శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. ప్రస్తుతం వారికి పన్నీర్ సెల్వం తప్ప వేరే ఎవ్వరూ దిక్కులేరని తెలుసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu former CM Panneerselvam team holds emergency meeting to discuss about joining of AIADMK Amma team today.
Please Wait while comments are loading...