Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఐటీ విద్యార్థికి ఒరాకిల్ బంపర్ ఆఫర్: వార్షిక వేతనం ఎంతంటే?

క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా.. ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది.

వారణాసి: దిగ్గజ కంపెనీలన్ని తమ సంస్థల్లో రిక్రూట్‌మెంట్ కోసం ముందు వాలిపోయేది ఐఐటీల్లోనే. ప్రతిభ గల విద్యార్థులకు కోట్ల రూపాయల ప్యాకేజీలతో తమ సంస్థల్లో ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. తాజాగా ఐఐటీ-బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి) విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్‌ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా.. ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఈ సంవత్సరం ఇదే అతిపెద్ద ప్యాకేజీ ఆఫర్ అని క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఈ దఫా యూనివర్సిటీలో చేపట్టిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే ఎంపికయ్యారని ప్లేస్‌మెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

Oracle offers 1.2crore pay for an IIT student

కాగా, గతేడాది నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థికి 2.27 కోట్లు వార్షిక ప్యాకేజీని గూగుల్ ఆఫర్ చేసినట్టుగా చెప్పారు. ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్వ్యూలు 19 వరకు కొనసాగుతాయని, 90 వరకు కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్ మెంట్స్ చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 500మంది విద్యార్థులు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+