సంగీత్ ఫంక్షన్ లో వరుడి ముందే దుమ్మురేపిన వధువు, కుటుంబసభ్యులు కూడ....

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెళ్ళిళ్ళను అంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరూ కలలు కంటుంటారు. అయితే ధనవంతులు తమ ఇళ్ళళో పెళ్ళిళ్ళను నలుగురు చెప్పుకొనేలా చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ పెళ్ళిళ్ళ సంప్రదాయాల్లో వింత పోకడలు పోతున్నాయి.

వివాహంలో కొత్త పెళ్ళి జంటను ఆనందింపజేసేందుకు వారి బంధువులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తుంటారు. అయితే వివాహనికి ముందు జరిగే సంగీత్ ఫంక్షన్ తో పాటు , వివాహం జరిగిన తర్వాత నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో ఈ డ్యాన్స్ కార్యక్రమాలుంటాయి.

మరో వైపు ఇటీవలే ఓ వివాహ వేడుకల్లో వరుడు తన స్నేహితులతో కలిసి పెళ్ళి వేదికపైనే డ్యాన్స్ చేసి అందరిని ఆనందింపజేశారు. ఇదే తరహలో సంగీత్ ఫంక్షన్ లో వరుడి ముందే వధువు డ్యాన్స్ చేసి అందరిని అబ్బుర పరిచింది.

పెళ్ళికుమారుడిని కూర్చొబెట్టి అతని ముందే ఎలాంటి బిడియం లేకుండానే కాబోయే పెళ్ళికూతురు డ్యాన్స్ చేయడం అరుదు. అయితే ఇదే తరహ ఘటన ఒకటి చోటుచేసుకొంది.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం లేవు.

17 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో పెళ్ళికూతురు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఏడాది జనవరి మాసంలో ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 60 లక్షల మంది ఈ వీడియోను చూశారు.

రికార్డుస్థాయిలో వధువు దాదాపుగా 17 నిమిషాల పాటు డ్యాన్స్ చేసింది.ఆమెతో పాటు ఆమె తన స్నేహితురాళ్ళు కూడ తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని ఆఖరుకు నానమ్మ , చిన్నపిల్లలు కూడ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
there are plenty of videos of sangeet dance performances that flood platforms like YouTube. But here's one that really takes the cake. At 17-minutes long, this marathon dance performance features the bride, her besties, her emotional mother and father, an adorable grandma and various cousins, aunts and uncles.
Please Wait while comments are loading...