చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన డిల్లీ హైకోర్టు...
ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం తోపాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఈకేసులో ఇద్దరిని డిల్లీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ దాఖలు అవకాశం ఇవ్వడంతో నేడు వాదనలు కొనసాగాయి.
. దీంతో కార్తీ చిదంబంరం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముందు కూడ ఈ కేసులో విజయం సాధిస్తామని ట్విట్లర్లో పేర్కోన్నారు.ఇక ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ఇప్పటికే చిదంబరానికి సుప్రింలో చుక్కెదురైంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం, రూ. 305కోట్ల ఐఎన్‌ఎక్స్ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీతోపాటు సీబిఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఒప్పందాల సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
బెయిల్ వచ్చిన తర్వాత కార్తి చిదంబరం ట్విట్టర్లో ముందు కూడ ఇదే విజయాలు సాధిస్తామని పేర్కోన్నారు. ఇది రాజకీయ కుట్రగా మొదటి నుండి చెబుతున్నామని నిధుల అక్రమ తరలింపులో తమకు సంబంధం లేదని పేర్కోన్నాడు.కనీసం తాను ఎయిర్ సెల్ సిమ్ కూడ వాడలేదని చెప్పారు.
ఇక మరోవైపు ఐఎన్ఎక్స్ మీడీయాలో కేసులో అవినీతీ ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను ఆగస్టు 21న సీబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. దీంతో ఆయన కస్టడీని పొడగిసిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు చేయడంతో చిదంబరం సిబీఐ కస్టడీ గురువారం వరకు కొనసాగనుంది. మరోవైపు ఈడీ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చిదంబరం సుప్రిం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ఆక్కడ కూడ ఆయన చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ సుప్రిం కోర్టు తీర్పు వెలువరించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications