ఒక్క కేసు పెట్టకుండా.. 106 రోజుల జైలులో.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం
ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో 106 రోజులపాటు తీహార్ జైలులో గడిపిన కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం బుధవారం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. సీబీఐ అరెస్ట్ చేసిన క్రమంలో ఆగస్టు 21 నుంచి కస్టడీలో ఉన్న ఆయనకు ముగ్గురు జడ్జీలతో కూడిన జస్టిస్ ఆర్ భానుమతి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు బయట చిదంబరంకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఎవరొచ్చారో ఎవరొచ్చారో చూడండి.. పులి బయటకు వచ్చింది.. పులి బయటకు వచ్చింది అంటూ నినాదాలు చేశారు. చిదంబరానికి జైలు సంకెళ్లు తొలిగిపోయాయి అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
బెయిల్‌పై బయటకు వచ్చిన మీడియాతో చిదంబరం మాట్లాడుతూ.. 106 రోజులు జైలులో పెట్టినా నాపై ఒక్క అభియోగాన్ని మోపలేదు అని అన్నారు. మీడియా ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నించగా, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే కోర్టు ఆదేశించడంతో ఆయన తదుపరి మాట్లాడానికి నిరాకరించారు.

సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. 106 రోజుల తర్వాత స్వేచ్ఛావాయువు పీల్చుకొంటున్నాను అని మీడియాతో అన్నారు. చిదంబరంకు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. చిదంబరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆయనను జైలులో పెట్టించింది అని అన్నారు.
ఇదిలా ఉండగా, జైలు నుంచి విడుదలైన తర్వాత చిదంబరం నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకొన్నారు. గురువారం ఉదయం ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంట్ బయట ఆయన ఉత్సాహంగా నడుస్తూ మీడియా కంటపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications