X కొత్త ఫీచర్ తో భారత్ లో రాజకీయ తుఫాన్..! పాకిస్తాన్ తో నేతల లింక్స్ ?

ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు భారత్ లో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటివరకూ ఎక్కడి నుంచో తమ ఖాతాలు నడుపుతూ ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారు, పెట్టించిన వారి గుట్టు క్రమంగా బయటపడుతోంది. దీంతో వారంతా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇందులో పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న మన నేతల అకౌంట్స్ కూడా బయటికి వస్తున్నాయి.

ఎక్స్ తాజాగా తమ ఖాతాదారుల అకౌంట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయో ఆ లోకేషన్ ను బయటపెడుతూ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో మనం ఎవరి ఖాతాలోకి వెళ్లి అయినా వారు దాన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ భారత్ లో రాజకీయ ప్రత్యర్థులపై చీకట్లో కూర్చుని బురదజల్లుతున్న నేతల బండారం బట్టబయలవుతోంది. ఇప్పటివరకూ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న పలు ఎక్స్ ఖాతాలు, ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఖాతాల బండారాన్ని ఈ లొకేషన్ ఫీచర్ బయటపెడుతోంది.

Pak Handles Claim Rocks India X s Location Feature Stirs Political Storm

కాంగ్రెస్ అనుకూల, హిందూ వ్యతిరేక ఎక్స్ ఖాతాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాల నుండి నడుస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీ నేతలు తమ ఖాతాల్ని ఎక్కడెక్కడి నుంచి నడుపుతున్నారో విపక్షాలు, ఫ్యాక్ట్ చెకర్లు బయటపెడుతున్నారు. భారత్ లో రాజకీయ నేతలపై విషం చిమ్ముతున్న ప్రత్యర్థులు, ఇతర ఖాతాలు విదేశాల నుంచే ఎక్కువగా ఆపరేట్ అవుతున్నట్లు తాజాగా బయటపడుతోంది. ఫేక్ పేర్లతో వీటిని ఎక్కడెక్కడి నుంచో నడుపుతున్నారు. అలా అయితేనే ఇక్కడ పోలీసులు, దర్యాప్తు సంస్దలు వారిని పట్టుకోలేరనేది వారి ధీమా.

Pak Handles Claim Rocks India X s Location Feature Stirs Political Storm

ఎక్స్ లో తప్పుడు సమాచారం పెరిగిపోతోందన్న ఆందోళనల నేపథ్యంలో యూజర్ల ఖాతాలు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయో బయటపెట్టడం ద్వారా పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ చెబుతోంది. ఇందులో ఎక్స్ ఖాతాలు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయో వెల్లడించడంతో పాటు వాటి పేర్లు ఎప్పుడెప్పుడు మార్చారో కూడా తెలుస్తోంది. దీంతో రాజకీయ నేతల మధ్య ఈ వివరాలు బయటపెట్టే వార్ కొనసాగుతోంది. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+