UP: ఇంటిపై పాకిస్థాన్ జెండా.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
నీ తల్లి మోసేది నవమాసాలేరా.. ఈ తల్లి మోయాలి కడవరకురా.. కట్టె కలేవరకురా.. అనే ఓ కవి చెప్పాడు. మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే.. మన దేశమే.. ఈ రోజు మనం అనభవిస్తున్న ప్రతి ఒక్కటి దేశంతో సాధ్యమైంది. మన దేశాన్ని రక్షించడానికి సైనికులు మంచు కొండల్లో శ్రమిస్తున్నారు. మనం ఇక్కడ ప్రశాతంగా నిద్ర పోతున్నాం. కానీ కొందరు దేశద్రోహుల చేసే పనికి తలెత్తుకోలేకపోతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ నివాసంలో పాకిస్థాన్ జెండాను ఎగురవేసిన ఘటన సంచలనం రేపింది. ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పోలీసులు స్పందంచారు. పోలీసులు ఆ ఇంటి నుంచి పాకిస్థాన్ జెండాను తొలగించి దేశద్రోహ నేరం కింద తండ్రీకొడుకులిద్దరినీ అరెస్ట్ జైలుకు పంపారు. మురాదాబాద్‌లోని భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్‌పూర్ అలీగంజ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

టెక్స్‌టైల్ వ్యాపారి రయీస్ ఇంటి వద్ద పాకిస్థాన్ జెండాను ప్రదర్శిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా అతడి ఇంటి పైకప్పుపై పాకిస్థాన్ జెండా రెపరెపలాడుతూ కనిపించింది. సాక్ష్యాధారాల కోసం పోలీసులు ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత జెండాను తీసి పడేశారు. నిందితులు రయీస్, అతని కుమారుడు సల్మాన్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
నిందితులిద్దరిపై దేశద్రోహ నేరం కింద భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 153ఏ, 153బీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పోలీసులతో పాటు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎల్‌ఐయు) కూడా వారిని విచారిస్తోంది. నిందితులిద్దరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఇంటిపై పాకిస్థాన్ జెండాను ఎగురవేయడానికి గల కారణాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications