భారత్, అఫ్గాన్‌తో యుద్ధానికి రెడీ - పాక్ మంత్రి
భారత్, అఫ్గాన్‌తో ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్‌తో భారత్ సంబంధాలు బలపడటాన్ని జీర్ణించుకోలేక ఈ కామెంట్స్ చేసినట్టు చెబుతున్నారు. ఈ మేరకు తాలిబన్ లతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. సరిహద్దుల్లో భారత్ 'డర్టీ గేమ్స్' ఆడటానికి ప్రయత్నిస్తోందని ఓ టీవి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఖ్వాజా ఆసిఫ్ ఘాటు వ్యాఖ్యలు..
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైతే పాకిస్థాన్ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించగా.. అవును.. దానిని కొట్టిపారేయలేం, ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని.. వాటి గురించి నేను చర్చించనని ఆయన సమాధానమిచ్చారు. అంతే కాకుండా పాకిస్థాన్‌లో నివసిస్తున్న అఫ్గాన్ శరణార్థులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారివల్ల పాక్‌కు ఎలాంటి ఉపయోగం లేదని.. పైగా వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పాక్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తిస్తున్నామని.. వారు వెంటనే మా దేశాన్ని వీడాలని ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

కాగా మరోవైపు పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య ఇటీవల పలు ఘర్షణలు జరిగి, ప్రాణనష్టం సంభవించింది. పాక్‌పై దాడులు ప్రారంభమైనప్పుడు అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలో ఉన్నారని, భారత ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని పాకిస్థాన్ ఆరోపించింది. అఫ్గానిస్థాన్ భారత్ తరఫున తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
ఇక ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యమిచ్చి వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఫైర్ అయ్యింది. తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం ఆ దేశానికి అలవాటు అని ఘాటుగా బదులిచ్చింది. అఫ్గానిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చెలాయించడం పాక్‌కు కోపం తెప్పిస్తోందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.
-
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప బీభత్సం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications