షాక్: శశికళకు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు, మరో 7గురు చేరితే ప్రభుత్వ పతనం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:అన్నాడీఎంకెలో చోటుచేసుకొన్న పరిణామాలు ప్రభుత్వంపై పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.పన్నీర్, పళనిస్వామి గ్రూపులు కలిసిపోవాలని నిర్ణయం తీసుకొన్నాయి.అయితే అన్నాడీఎంకె నుండి శశికళ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు మంత్రి జయకుమార్ ప్రకటించడంతో శశికళను సమర్థించే పదిమంది ఎమ్మెల్యే దినకరన్ తో సమావేశమయ్యారు.మరో ఏడుగురు ఎమ్మెల్యేలు శశికళ గ్రూప్ వెపుకు వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకొన్నాయి. జయలలిత మరణం తర్వాత పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్న శశికళకు ఊహించని షాక్ ఎదురైంది. పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు మంత్రి జయకుమార్ ప్రకటించారు.

పార్టీని కాపాడుకొనేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా పార్టీ మంత్రి జయకుమార్ ప్రకటించారు. అయితే రెండు రోజులుగా పన్నీర్ సెల్వం గ్రూపుతో చేసిన చర్చలు కొలిక్కి రావడంతో ఈ మేరకు పళనిస్వామి గ్రూప్ ఈ నిర్ణయం తీసుకొంది.

అయితే దినకరన్ పై కేసు నమోదు కావడం, పార్టీకి ఎన్నికల గుర్తు దక్కకపోవడం లాంటి పరిణామాలను పురష్కరించుకొని రెండు వర్గాలు రాజీ ఫార్మూలాను అనుసరించాయి.అయితే ఊహించని షాక్ ఇవ్వడంతో దినకరన్ వర్గం ఆత్మరక్షణలో పడింది. తాము పెంచి పోషించినవారే తమను పార్టీ నుండి తొలగించడంతో దినకరన్ ఒంటికాలిపై లేస్తున్నాడు.

శశికళకు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు

శశికళకు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు

పార్టీ నుండి శశికళతో పాటు దినకరన్ ను తొలగిస్తూ పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని పదిమంది ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బహిష్కరించడంతో దినకరన్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఈ విషయం తెలియగానే శశికళకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలంతా దినకరన్ తో సమావేశమయ్యారు. తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలపై చర్చించారు.తమతో చర్చించకుండానే ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకొంటారని శశికళ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

 పళని ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది

పళని ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో బొటాబొటా మెజారిటీతో ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.

కనీస మెజారిటీకి 6 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఆయనకు విశ్వాస పరీక్ష సందర్భంగా ఓటు వేశారు.అయితే తాజాగా చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు శశికళ గ్రూప్ కు మద్దతిస్తున్నారు. మరో 7 ఎమ్మెల్యేలు పళనిస్వామి నుండి శశికళ శిభిరానికి మళ్ళితే పళని స్వామి ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.దీంతో తమకు ఎదురుతిరిగిన పళనిస్వామి గ్రూప్ కు చెక్ పెట్టేందుకు శశికళ గ్రూప్ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పన్నీర్ సెల్వం

ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పన్నీర్ సెల్వం

బుదవారం నాడు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం సమావేశం కానున్నారు. ఈ రెండు గ్రూపులు విలీనం కావాలనే ప్రతిపాదన పట్ల పళనిస్వామి వర్గం సానుకూలంగా స్పందించింది.అంతేకాదు పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని దూరం పెట్టారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ కార్యాచరణపై బుదవారం నాడు తన వర్గం ఎమ్మెల్యేలతో పన్నీర్ సమావేశం కానున్నారు.

శశికళ గ్రూప్ ఏం చేయనుంది

శశికళ గ్రూప్ ఏం చేయనుంది

పార్టీలో తమపై తిరుగుబాటు జరిగే పరిస్థితులు నెలకొన్నాయని శశికళ వర్గం భావించకపోవచ్చు. అయితే ఆర్ కె నగర్ ఉప ఎన్నిక రద్దు, ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు దక్కకపోవడం లాంటి పరిణామాలు పార్టీలో సీనియర్లను కలవరపాటుకు గురిచేశాయి.


అంతేకాదు తాజాగా దినకరన్ పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులు కూడ పార్టీ నాయకులను మరింత ఆత్మరక్షణలో పడేలా చేశాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నుండి శశికళ కుటుంబానికి చెక్ పెట్టారు.అయితే ఈ పరిణామాలతో దిమ్మదిరిగిన శశికళ గ్రూప్ చేయనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.పళనికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu chiefminister Palaniswami faces a threat from supporters of sasikala MLAs.10 MLA's disagree expel sasikala family from AIADMK.If sasikala supporters MLAs number increase there's a chance to Palani government dissolved
Please Wait while comments are loading...