వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకు శశికళ: ఎదిరించి.. మంచి ఛాన్స్ కోల్పోయిన పన్నీరుసెల్వం

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మంచి అవకాశాన్ని కోల్పోయారా? అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ఢీకొనడం ద్వారా దెబ్బతిన్నారా? ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాలు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మంచి అవకాశాన్ని కోల్పోయారా? అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ఢీకొనడం ద్వారా దెబ్బతిన్నారా? ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

పన్నెండు రోజుల క్రితం అన్నాడీఎంకే అధినేత్రి శశికళను ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.

అంతలోనే పన్నీరు సెల్వం తిరుగుబావుటా ఎగురవేశారు. శశికళను ఢీకొనే ప్రయత్నాలు చేశారు. దీంతో తాను సీఎం అయ్యేందుకు శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. అక్కడ బుజ్జగింపులు, బెదిరింపులు జరిగాయనే వాదనలు ఉండటం వేరే విషయం.

ఆసక్తికర పరిణామాలు

ఆసక్తికర పరిణామాలు

దాదాపు పదిహేను రోజులు పార్టీలో, తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళ - పన్నీరు వర్గీయులు ఎత్తులుపైఎత్తులు వేసుకున్నారు. ఇంతలో అనూహ్యంగా సుప్రీం కోర్టు అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

పన్నీరు ఎదురు తిరగడంతో..

పన్నీరు ఎదురు తిరగడంతో..

పన్నీరు సెల్వం ఎదురు తిరగడంతో.. శశికళ ముఖ్యమంత్రి పీఠంగా పళనిస్వామికి అవకాశమిచ్చారు. అదే పన్నీరు సెల్వం చిన్నమ్మతో బాగుంటే ఆయననే తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగేవారని అంటున్నారు.

విశ్వాసపాత్రుడు

విశ్వాసపాత్రుడు

నాడు జయలలితకు పన్నీరు సెల్వం అత్యంత విశ్వాసపాత్రుడు. దీంతో ఆమెకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పన్నీరు సీఎం అయ్యారు. జయ తిరిగి వచ్చాక పదవిని ఆమెకు అప్పగించేవారు.

అర్ధరాత్రి పదవి

అర్ధరాత్రి పదవి

జయలలిత మృతి అనంతరం నాటి పరిస్థితుల దృష్ట్యా అర్ధరాత్రి పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. ఆ తర్వాత శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యాకు పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఆయన తిరుగుబాటు చేశారు.

పన్నీరుపై నాడు శశికళ ప్రశంస

పన్నీరుపై నాడు శశికళ ప్రశంస

అన్నాడీఎఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికైన సమయంలో పన్నీరు పైన ప్రశంసలు కురిపించారు. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఇప్పుడు శశికళ జైలుకు వెళ్లినందున.. పన్నీరు ఎదురు తిరిగి ఉండకుంటే జయలలితలాగే, శశికళ కూడా పన్నీరుకే అవకాశం ఇచ్చి ఉండేవారని అంటున్నారు.

పోటీకి శశికళ అనర్హురాలు

పోటీకి శశికళ అనర్హురాలు

అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల పాటు జైలులో ఉంటున్నారు. దీంతో ఆమె పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు. పన్నీరు ఆమెతో బాగా ఉంటే... ఆయన ఈ టర్మ్ హాయిగా కొనసాగి ఉండేవారని అంటున్నారు.

శశికళ ఆసలు కల్లలు.. పన్నీరుకు పళనితో చెక్

శశికళ ఆసలు కల్లలు.. పన్నీరుకు పళనితో చెక్

పన్నీరు తిరుగుబాటుతో సీఎం సీటుపై శశికళ పెంచుకున్న ఆశలన్నీ కల్లలయ్యాయి. సీఎం పీఠం దక్కకపోగా జైలు జీవితంతో తమిళ రాజకీయాల్లో శశికళ పాత్ర ముగిసింది. అయితే ఆమె ప్రతిపాదించిన పళనిస్వామి గవర్నర్‌ను కలిసి తనకు ఎమ్మెల్యేల మద్దతుందని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ఇక నాన్చకూడదని గవర్నర్ భావించారు.

పళని సీఎంగా..

పళని సీఎంగా..

పళనిస్వామికి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లు పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. పళని స్వామి సీఎం అయ్యారు. శశికళ ప్రతిపాదించిన పళనిస్వామికే సీఎం పీఠం దక్కింది. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి చెబుతున్నారు.

పన్నీరు ప్రయత్నాలు విఫలం

పన్నీరు ప్రయత్నాలు విఫలం

పళని ముఖ్యమంత్రి కావడంతో పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. సీనియర్ నేతలంతా తన వైపు ఉన్నారన్న నమ్మకంతో ఇన్నాళ్లు ముఖంపై చిరునవ్వు చిందించిన పన్నీర్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా మాట మార్చారు. దీంతో పన్నీర్‌కు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఆయన పళనిస్వామికే మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారని అంటున్నారు.

English summary
Tamil Nadu governor C Vidyasagar Rao on Thursday invited E Palaniswami to be the next chief minister of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X