వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేంది స్వామి: కొలువు అడిగితే లాఠీతో కొట్టి, జాతీయ జెండా పట్టుకున్న..(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో నిరుద్యోగులు కదం తొక్కారు. టీచింగ్ పోస్టుల కోసం ఎదురుచూస్తోన్న వందలాది మంది రోడ్డెక్కారు. తమ కొలువులు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. సోమవారం పాట్నాలో చేపట్టిన ఆందోళన హింసాత్మక పరిస్థితులకు దారితీసింది. ఓ అభ్యర్థిని పోలీస్ అధికారి కొడుతున్న వీడియో కనిపిస్తోంది. జాతీయ జెండా పట్టుకున్న ఓ అభ్యర్థి.. తనను కొట్టారని భావించారు. అయినా ఓ పోలీస్ వినిపించుకోలేదు. లాఠీతో దాడి చేశాడు.

 అమానవీయంగా..

అమానవీయంగా..

పాట్నాలో గల డాక్ బంగ్లా చౌరాహ వద్ద తమ కొలువుల ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. అందులో ఏడీఎం కేకే సింగ్ మాత్రం వారి పట్ల దయలేకుండా ప్రవర్తించారు. జాతీయ జెండా పట్టుకున్న వదల్లేదు. జెండాను తీసుకొని మరీ చావకొట్టారు. ఘటనాస్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. వారితోపాటు సీటీఈటీ, బీటీఈటీ అభ్యర్థులు తమకు ప్రైమరీ టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయాలని కోరారు. తాము 2019 నుంచి కొలువుల కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయని.. కానీ పనులు కావడం లేదన్నారు.

ఫస్ట్ క్యాబినెట్..


కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కూడా తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిందని గుర్తుచేశారు. తేజస్వీ యావ్.. తొలి మంత్రివర్గ సమావేశంలోనే అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ ఏమీ జరగలేదని చెప్పారు. ఘటనపై బీహర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. వీడియోలో దాడి చేయడంపై పాట్నా మేజిస్ట్రేట్‌తో మాట్లాడారు. పాట్నా సెంట్రల్ ఎస్పీ, డీడీసీ నేతృత్వంలో కమిటీ వేశారు.

ఇదీ నితీశ్ ప్రభుత్వ రూపం

ఇదీ నితీశ్ ప్రభుత్వ రూపం


మరోవైపు కొత్త ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేసింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా.. నితీశ్ కుమార్ అంటూ ఫైర్ అయ్యింది. కొలువులు అడిగితే పోలీసుల చేత కొట్టించిందని మండిపడింది. అమానవీయంగా ప్రవర్తించిందని ధ్వజమెత్తింది. బీహర్ ప్రభుత్వం, పోలీసులు.. టీచర్ అభ్యర్థులనే కాదు.. జాతీయ జెండాను కూడా అవమానించారని మండిపడింది. ఇదీ జేడీయూ ఆర్జేడీ ప్రభుత్వం అసలు రూపం అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు.

English summary
aspirants for teacher posts protesting against delay in recruitment they were lathicharged by the police in Bihar's capital Patna. video from the protest has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X