valentines day: పార్కులో ప్రియురాలితో భర్త రొమాన్స్, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, దబిడదిబిడే
పాట్నా: ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికుల కోలాహలంతో ఆ పార్కు సందడిగా మారింది. అయితే, ఓ వివాహిత ఆమె భర్తను చితకబాదడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. అతడు వాలెంటైన్స్ డే రోజున తన ప్రియురాలితో కలిసి పార్కు రావడమే ఇందుకు కారణం. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.

పెళ్లై పిల్లలున్నా..
వివరాల్లోకి వెళితే.. సదరు జంటకు మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి కాపురం సాఫీగానే సాగిపోతోంది. అయితే, కొంత కాలంగా భర్త వ్యవహారంపై భార్యకు అనుమానం వచ్చింది. మరో యువతితో వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించింది.

ప్రేమికుల రోజు.. ప్రియురాలితో భర్త..
ఈ క్రమంలో శుక్రవారంనాడు ప్రేమికుల దినోత్సవం కావడంతో భార్య అనుమానించినట్లుగానే తన భర్త మరో యువతితో చక్కర్లు కొడుతున్నాడు. శుక్రవారం పాట్నాలోని ఈకో పార్క్ ఘుమన్‌కు తన ప్రియురాలితో కలిసి వెళ్లాడు ఆమె భర్త. విషయం తెలిసి తన భర్త కోసం గాలిస్తూ అతని వద్దకు వెళ్లింది భార్య.

ప్రియురాలితో భర్త రొమాన్స్.. అప్పుడే వెళ్లిన భార్య..
అంతేగాక, పోలీసులను కూడా వెంటబెట్టుకుని వచ్చిందా వివాహిత. పార్కులో ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిని అలా చూసిన ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. భర్త, అతని ప్రియురాలికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించింది. నోటికివచ్చిన తిట్లు తిట్టింది.

ఎడాపెడా వాయించేసింది..
భార్య, ఇద్దరు పిల్లలున్నారనే విషయం మర్చిపోయి మరో యువతితో ఇలా సిగ్గులేకుండా తిరుగుతున్నావంటూ భర్తకు చీవాట్లు పెట్టింది. ఆ యువతిని కూడా ఉతికిఆరేసింది. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో వారి ముగ్గురికీ.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. కాగా, పార్కులో భర్త, భార్య, ఓ ప్రియురాలు గొడవపపడిన సందర్భంలో భారీ ఎత్తున ప్రజలు గుమిగూడారు. అంతేగాక, ఈ తతంగాన్నంతా వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకోవడం గమనార్హం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications