పొట్లూరి: పవన్ సంచలన వ్యాఖ్యలు, జెపి కోసమే వదిలా

తెలుగుదేశం పార్టీ టికెట్ల వ్యవహారంలో తాను కలగజేసుకోవడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో లోకసత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు.
మల్కాజిగిరిలో తాను జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు. మల్కాజిగిరి నుండి పోటీ చేయాలని తాను మొదట భావించానని కానీ, జెపి కోసం విరమించుకున్నానని చెప్పారు. జనసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామియేనని స్పష్టం చేశారు.
అంతకుముందు కర్నాటక ప్రచారంలో మాట్లాడుతూ... తెలుగువారి కోసం ఎక్కడికైనా వస్తానన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత గురించి కన్నడిగులకు బాగా తెలుసన్నారు. మోడీకి పని తప్ప వేరే తెలియదన్నారు. మోడీకి వ్యక్తిగత ఆస్తులు ఏమీ లేవన్నారు. కాంగ్రెసు కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications