ప్రేమ నచ్చకే షీనా బొరాను హత్యకు కుట్ర: సిబిఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకు తల్లి ఇంద్రాణీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీయే కుట్ర చేశారని సిబిఐ ముంబై హైకోర్టుకు తెలిపింది. పీటర్ ముఖార్జియా కుమారుడు రాహుల్‌తో ఆమె ప్రేమ సంబంధం వీరిద్దరికీ నచ్చలేదని, అందువల్లే హత్యకు పథకం రచించారని స్పష్టం చేసింది.

షీనా హత్య: 'మా సాయంతో ఇంద్రాణి గొంతు పిసికింది'

ఈ కేసులో దర్యాప్తు చాలా కీలకమైన దశలో ఉందని ఈ పరిస్థితిలో పీటర్‌కు బెయిలు ఇవ్వటం సరికాదని, ఒకప్పటి మీడియా రారాజు అయిన ఆయన కేసును తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. ఇంద్రాణి, పీటర్ చాలా ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో, ఎవరికీ అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ వేసి షీనాను 2011 ఏప్రిల్ 3న హతమార్చారని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది.

Peter Mukerjea, Indrani Mukerjea

ఇందుకు సంబంధించిన సమాచారంతో ఓ అఫిడవిట్‌ను సిబిఐ తరపు న్యాయవాది, జస్టిస్ పి.ఎన్. దేశ్‌ముఖ్‌కు సమర్పించారు. ఈ కేసును న్యాయమూర్తి జూలై 27కు వాయిదా వేశారు. షీనా హత్య కేసులో పీటర్‌ను నిరుడు నవంబర్ 19న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

షీనా హత్య కేసులో కీలకమలుపు: అప్రూవర్‌గా డ్రైవర్

విచారణను కోర్టు జులై 27వ తేదీకి వాయిదా వేసింది. కేసులో పీటర్ ముఖార్జియా నాలుగో నిందితుడు. వారిద్దరితో పాటు ఇంద్రాణి మాజీ భర్త సంజీవి ఖన్నా, ఆమె మాజీ డ్రైవ్ర శ్యామ్‌వర్ రాయ్ కూడా ఈ కేసులో నిందితులు. రాహుల్ పీటర్ ముఖార్జీయా మొదటి భార్య కుమారుడు కాగా, షీనా బోరా ఇంద్రాణి మాజీ భర్త కూతురు. రాహుల్‌తో షీనా బొరా సంబంధం సరికాదని పీటర్ ముఖార్జియా అభిప్రాయపడ్డాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Peter Mukerjea had along with his wife Indrani Mukerjea conspired to kill her daughter Sheena Bora as they were not happy with her relationship with Mr Peter's son Rahul Mukerjea, the CBI told the Bombay High Court today while opposing the former media baron's bail plea.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X