పోలింగ్ దశలు ఆరంభమైన కొద్దీ..: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ రేట్లివీ..

న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వాటి రేట్లు తగ్గడం అయిదు రోజుల్లో ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లల్లో స్వల్పంగా క్షీణత కనిపించింది. వరుసగా 25 రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెల 24వ తేదీన తొలిసారిగా నేల చూపులు చూశాయి. ఆ మరుసటి రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. తాజాగా మరోసారి తగ్గాయి.

అయిదు రాష్ట్రాల పోలింగ్ ప్రభావం.. పెట్రోల్ రేట్లపై

అయిదు రాష్ట్రాల పోలింగ్ ప్రభావం.. పెట్రోల్ రేట్లపై

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్‌కు మూడురోజుల ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు రెండుసార్లు తగ్గాయి. ఇప్పుడదే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ గడువు సమీపించే సరికి మళ్లీ వాటి రేట్లు తగ్గాయి. గురువారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయిదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత మళ్లీ వాటి ధరలు మళ్లీ పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

నగరాల వారీగా వివరాలివీ..

నగరాల వారీగా వివరాలివీ..

మంగళవారం నాటి తాజా సవరణల ప్రకారం.. పెట్రోల్ లీటరు ఒక్కింటికి 22 పైసలు, డీజిల్‌ లీటర్ ఒక్కింటికి 23 పైసల మేర తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.90.56 పైసలు, డీజిల్ రూ.80.87 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోలు రేటు 96.98 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 87.96 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోలు రూ. 92.58, డీజిల్‌ ధర రూ. 85.88, కోల్‌కతలో పెట్రోలు రూ.90.77 పైసలు, డీజిల్‌ ధర రూ.83.75 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-92.89, డీజిల్-86.12, బెంగళూరులో పెట్రోల్-93.59, డీజిల్-85.75, హైదరాబాద్-94.16, డీజిల్-88.20, నొయిడాలో పెట్రోల్-88.69, డీజిల్-81.33, భోపాల్‌లో పెట్రోల్-98.58, డీజిల్-89.13గా రికార్డయ్యాయి.

క్రూడాయిల్ ధరలు నిలకడగా..

క్రూడాయిల్ ధరలు నిలకడగా..

రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు కొద్దిగా పెరిగాయి. గతవారంతో పోల్చుకుంటే..స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కిందటి బుధవారం 15 శాతం మేర తగ్గగా.. మరుసటి రోజు 1.8 శాతం మేర దిగజారింది. ఇదివరకు బ్యారెల్ క్రూడాయిల్ రేటు 71 డాలర్లు ఉండగా.. గత బుధ, గురువారాల్లో 64, 63.27 డాలర్లకు తగ్గింది. తాజాగా క్రూడాయిల్ బ్యారెల్ ధర 26 శాతం మేరకు పెరిగి, 64.83 డాలర్ల వద్ద నిలిచినట్లు బ్రెంట్ ఆయిల్ వెల్లడించింది. యూఎస్ క్రూడ్ మార్కెట్‌లో బ్యారెల్ ధర 61.44 డాలర్లు పలుకుతోంది.

 1న బెంగాల్ రెండో విడత పోలింగ్..

1న బెంగాల్ రెండో విడత పోలింగ్..

అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత పోలింగ్ ముగిసింది కూడా. గురువారం రెండో దశ పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. బెంగాల్‌లో ఎనిమిది విడతలు, అస్సాంలో మూడు దశల్లో పోలింగ్‌ను కొనసాగిస్తారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 6వ తేదీన ఒకేదశలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ పరిణామాల మధ్య పెట్రోల్, డీజిల్ దరలు వారంరోజుల వ్యవధిలో మూడుసార్లు తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+