పెట్రో ధరల మోత.. మళ్లీ పెరిగిన రేటు, తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వాలు కూడా కొలువుదీరాయి. ఇంకేముంది పెట్రో వాత తప్పడం లేదు. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన వెంటనే మోత మోగాల్సింది.. కానీ 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో.. అలా గ్యాప్ ఇచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు మాత్రం పెట్రో ధర మోత మోగుతుంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నడిచాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ధరల మోత..
వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ధరల పెంపు అనంతరం లీటర్ పెట్రోల్ దేశంలో రూ. 3.70, డీజిల్ రూ. 3.75 వరకు పెరిగింది. 22వ తేదీ నుంచి ధరలు కంటిన్యూగా పెరుగుతూ వస్తున్నాయి.

సిటీలో ఇలా..
పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.37గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 98.69గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.24గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.56గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.58 ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.39గా ఉంది.

గుంటూరు, ఢిల్లీలో ఇలా
ఇటు గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.114.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.46కు లభిస్తోంది. కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.114.28కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.22కు లభిస్తోంది. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.42కు లభిస్తోంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.57కు లభిస్తోంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.00గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.10కు లభిస్తోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.67కు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్, క్రూడయిల్ ధర పెంపు.. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల ధరల పెరుగుతు వస్తున్నాయి.
-
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications